STOCKS

News


స్థిరంగానే పాలసీ రేట్లు..

Wednesday 5th December 2018
news_main1544001055.png-22667

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణమైన నిర్ణయాన్నే ప్రకటించింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంగా నిలకడగానే ఉంది. రెపో పెంపుతో అనుసంధానమైన ఇతర పాలసీ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. రివర్స్‌ రెపో రేటు 6.25 శాతంగా ఉంది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్‌) మాత్రం 4 శాతం వద్ద యథాతథంగానే ఉంచింది. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌), బ్యాంక్‌ రేట్లు సైతం 6.75 శాతంగా స్థిరంగా ఉన్నాయి. ఎస్‌ఎల్‌ఆర్‌ను25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. ఇక జీడీపీ వృద్ధి అంచనాలను  ప్రస్తుత ఆర్థిఖ సంవత్సరం రెండో అర్ధభాగం ద్రవ్యోల్బణ అంచనాలను 2.7-3.2 శాతానికి తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలో క్రూడ్‌ ధరల్లో ఒడిదుడుకులు ఉండొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో సీపీఐ 3.8-4.2 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. 


RBI

You may be interested

ప్రతి 3లో 2 షేర్లకు టార్గెట్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 5th December 2018

ముంబై: నవంబర్‌లో నిఫ్టీ 50 ఇండెక్స్‌ 4.7 శాతం లాభపడింది. దేశీ మార్కెట్లు గతనెలలో ఏకంగా 891 మిలియన్‌ డాలర్ల విదేశీ నిధులను ఆకర్షించాయి. ఇదే నెలలో ముడిచమురు ధర 20 శాతం పతనమవగా డాలరుతో రూపాయి మారకం విలువ 4.4 శాతం బలపడింది. ఇంతటి సానుకూల అంశాలలో సైతం అనలిస్టులు తామ కవరేజ్‌లో ఉన్నటువంటి 67.6 శాతం షేర్లను డౌన్‌గ్రేడ్‌ చేశారు. ప్రతి 3 షేర్లలో 2 షేర్ల

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Wednesday 5th December 2018

కీలక వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం మార్కెట్‌ వర్గాల నిరీక్షణ నేపథ్యంలో పలు బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ నేటి ట్రేడింగ్‌లో 1శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(26,693.80)తో పోలిస్తే అరశాతం నష్టంతో 26,557.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన

Most from this category