STOCKS

News


ఆర్‌బీఐ నుంచి మరో రూ.10,000 కోట్లు

Wednesday 19th December 2018
news_main1545194558.png-23072

ముంబై: ఆర్థిక వ్యవస్థలోకి మరో 10,000 కోట్ల నిధులను అందించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ నెలలో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా  రూ.40,000 కోట్లు అందించనున్నామని గతంలో ఆర్‌బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంట్లో ఇప్పటికే సగం.. రూ.20,000 కోట్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత లిక్విడిటీ పరిస్థితులను మదింపు చేసి, అదనంగా మరో రూ.10,000 కోట్లు అందించాలని నిర్ణయించామని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నెలలో రెండు దశలుగా రూ.15,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఈ నెల 20న  మొదటి విడతగా రూ.15,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని తెలిపింది. ఇక వచ్చే నెలలో మరో రూ.50,000 కోట్ల నిధులను అందుబాటులోకి తెస్తామని వివరించింది. ఐదు దశల్లో రూ.10,000 కోట్ల చొప్పున ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా ఈ నిధులు అందిస్తామని తెలిపింది. 



You may be interested

లింగ అసమానతలో భారత్‌ 108వ స్థానం

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు సంబంధించి ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 108వ స్థానంలో నిల్చింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ‘గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌' ప్రకారం గతేడాది కూడా భారత్‌ ఇదే ర్యాంక్‌ దక్కించుకుంది. ఆర్థికపరమైన అవకాశాలు, రాజకీయ సాధికారికత, విద్య, ఆరోగ్యం, మనుగడలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. దేశీయంగా సీనియర్, ప్రొఫెషనల్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం

యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆధార్ చట్ట సవరణల ప్రతిపాదనల ప్రకారం విశిష్ట గుర్తింపు సంఖ్యల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు లభించనున్నాయి. ఒక రకంగా నియంత్రణ సంస్థ పాత్ర పోషించనుంది. బయోమెట్రిక్‌ ఐడీ దుర్వినియోగం చేసే వారిపైనా, నిబంధనలు ఉల్లంఘించేవారిపైనా భారీగా జరిమానాలు విధించేందుకు కూడా దీనికి అధికారాలు దఖలుపడనున్నాయి. సవరణ ప్రతిపాదనల ప్రకారం.. ఆధార్ డేటాబేస్‌లోకి అనధికారికంగా చొరబడిన పక్షంలో 10 ఏళ్ల దాకా కఠిన

Most from this category