News


పరిశ్రమలపై ఆర్‌బీఐ గవర్నర్‌ దృష్టి

Thursday 17th January 2019
news_main1547699417.png-23628

- నేడు కార్పొరేట్‌ అధిపతులతో శక్తికాంత్‌ భేటీ
- ఇప్పటికే బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలపై  చర్చలు
- చిన్న పరిశ్రమల ప్రతినిధులనూ కలిసిన దాస్‌

ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ట్వీట్‌లో దాస్‌ ఈ వివరాలను వెల్లడించారు.  నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి కేవలం అరశాతంగా నమోదయిన నేపథ్యంలో గవర్నర్‌ పారిశ్రామిక బృందాలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్‌ రిటైల్‌  (2.19 శాతం), టోకు ధరలు (3.80 శాతం)  తగ్గిన పరిస్థితుల్లో ఆర్‌బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 6.5 శాతం) తగ్గించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పాలసీ విధానాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్‌బీఐ తమ వాదనలకు ప్రాధాన్యమివ్వడం లేదని కూడా పలు సందర్భాల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి విమర్శ వస్తోంది. కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ  ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
వరుస సమావేశాలు...
ఆర్‌బీఐ గవర్నర్‌గా డిసెంబర్‌ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశమయ్యారు. లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై  ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), నాన్‌- బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల  ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ మాజీ చైర్మన్‌ యూకే సిన్హా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ.25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్‌వ్యవస్థీకరించడానికి కూడా ఆర్‌బీఐ అనుమతించింది. దేశంలోని అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో పలు ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తీవ్ర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రంగం ప్రతినిధులతోనూ గవర్నర్‌ దాస్‌ చర్చించారు.You may be interested

దక్షిణాదిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ప్లాంటు

Thursday 17th January 2019

- పరిశీలనలో తెలంగాణ, ఏపీ - కంపెనీ సీఈవో అవనీత్‌ సింగ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో కొడాక్‌, థామ్సన్‌ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉ‍న్నాయని సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త

బొనాంజా పోర్టుఫోలియో సిఫార్సులు

Thursday 17th January 2019

గురువారం మార్కెట్లు స్వల్పలాభాల్లో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 10900 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. గురువారం ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌ సహా 19 కంపెనీలు క్యు3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇకపై ఎర్నింగ్సే మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశిస్తాయని బొనాంజా పోర్టుఫోలియో అభిప్రాయపడింది. పైస్థాయిలో 11000 పాయింట్లు, దిగువన 10700 పాయింట్లు కీలక నిరోధం, మద్దతుగా నిలుస్తాయి. 11000 పాయింట్లకు పైన 11200 పాయింట్ల వరకు ర్యాలీ కొనసాగవచ్చు. 10700 పాయింట్లను కోల్పోతే 10500 పాయింట్ల వరకు

Most from this category