STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకుల ఛీప్‌లతో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ

Tuesday 29th January 2019
news_main1548736672.png-23868

న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరగున్న తదుపరి మానిటరీ పాలసీ సమీక్షకు ముందు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకులతో సమావేశమయ్యారు. బ్యాంకింగ్‌ రంగం నుంచి ఆర్‌బీఐ ఏమి కోరుకుంటుందన్నది వారికి ఆయన తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ తన చివరి ద్వైమాసిక పాలసీ సమీక్షను ఫిబ్రవరి 7న ప్రకటించనుంది. ‘‘బ్యాంకింగ్‌ రంగం నుంచి ఆర్‌బీఐ ఏమి ఆశిస్తుందో వారికి తెలియజేయడం, బ్యాంకింగ్‌ రంగ పరిస్థితులపై వారి అవగాహనను తెలుసుకోవడం, అలాగే, భవిష్యత్తుపై అవగాహన కోసమే భేటీ జరిగింది’’ అని పీఎస్‌యూ బ్యాంకుల సీఈవోలతో భేటీ తర్వాత శక్తికాంత దాస్‌ మీడియాకు తెలిపారు. రానున్న ఎంపీసీ భేటీలో కీలక రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే.



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రొవిజనింగ్‌ సెగ

Tuesday 29th January 2019

- క్యూ3లో రూ. 4,738 కోట్లకు ఎగిసిన నష్టాలు ముంబై: మొండిబాకీలకు కేటాయింపులు రెట్టింపు కావడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నష్టాలు మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 4,738 కోట్లకు ఎగిశాయి. 40 భారీ మొండి పద్దులపై దివాలా చట్టం కింద విచారణ జరుగుతుండటం, కొత్తగా ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం రూపంలో మొండిబాకీలు మరింతగా పెరగడం ఇందుకు కారణం. భారీ మొండిబాకీల కారణంగా ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత

గ్రూప్‌ఎమ్‌లో భారీ పునర్వ్యస్థీకరణ

Tuesday 29th January 2019

హైదరాబాద్‌: డేటా సెంట్రిక్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్వీసుల దిగ్గజ సంస్థ, గ్రూప్‌ఎమ్‌లో ఉన్నత స్థాయిలో భారీ పునర్వ్యస్థీకరణ చోటు చేసుకుంది. గ్రూప్‌ ఎమ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సౌత్‌ ఏషియా) ప్రశాంత్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రెసిడెంట్‌ గ్రోత్‌ అండ్‌  ట్రాన్స్‌ఫార్మేషన్‌గా (సౌత్‌ ఏషియా) తుషార్‌ వ్యాస్‌ నియమితులయ్యారు. అలాగే గ్రూప్‌ఎమ్‌ కంపెనీలో ఒక విభాగమైన మైండ్‌షేర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సౌత్‌ ఏషియా) పార్థసారధి మాం‍డ్యం, మైండ్‌ షేర్‌ చీఫ్‌

Most from this category