STOCKS

News


ప్రధానితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ

Tuesday 13th November 2018
news_main1542086069.png-21942

న్యూఢిల్లీ: కేంద్రంతో వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న న్యూఢిల్లీ వచ్చిన ఉర్జిత్ పటేల్‌.. ప్రధాని కార్యాలయంలో పలువురు సీనియర్ అధికారులతో సమావేశం అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్నింటిలో ప్రధాని కూడా పాల్గొన్నట్లు వివరించాయి. ఈ చర్చల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడానికి సంబంధించి ఆర్‌బీఐ ప్రత్యేక విధానమేదైనా రూపొందించే అవకాశమున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాయి. అయితే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) లిక్విడిటీ సమస్యలు తీర్చడం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న మిగులు నిధుల్లో గణనీయ భాగాన్ని ప్రభుత్వానికి బదలాయించడం వంటి అంశాలపై ఏదైనా అంగీకారం కుదిరిందా లేదా అన్నది తెలియరాలేదు. ఈ నెల 19న రిజర్వ్ బ్యాంక్ ‍బోర్డు కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొండి బాకీలతో కుదేలైన బ్యాంకులపై కఠిన చర్యలు, వ్యవస్థలో లిక్విడిటీ నిర్వహణ, ప్రభుత్వానికి డివిడెండ్ తదితర విషయాల్లో ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.   


RBI

You may be interested

పెరిగిన విమ్టా లాభం

Tuesday 13th November 2018

హైదరాబాద్‌: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో విమ్టా ల్యాబ్స్‌ నికర లాభం పెరిగింది. గత ఆర్ధిక సంవత్సంలో రూ.4.33 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని ఆర్జించగా.. ఇప్పుడది రూ.6.97 కోట్లకు పెరిగింది. ఇక, మొత్తం ఆదాయం రూ.53.82 కోట్లను నమోదు చేయగా.. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.43.67 కోట్లుగా ఉంది. ––– తగ్గిన ఎన్‌సీఎల్‌ లాభం సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్ధిక సంవత్సరం ఫలితాల్లో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం తగ్గింది. గత ఆర్ధిక సంవత్సరం

నాల్కో లాభం 229 శాతం వృద్ధి

Tuesday 13th November 2018

భువనేశ్వర్‌: అల్యూమినియమ్‌ దిగ్గజం, ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ (నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.510 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.223 కోట్లతో పోలిస్తే 229 శాతం వృద్ధి సాధించామని నాల్కో తెలిపింది. నిర్వహణ లాభం రూ.223 కోట్ల నుంచి 229 శాతం వృద్ధితో రూ.725 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఆర్థిక

Most from this category