News


క్యాపిటల్‌ నిబంధనల సడలింపుతో బ్యాంకులకు చేటు!!

Tuesday 20th November 2018
news_main1542699987.png-22224

రిజర్వు బ్యాంక్‌ తాజాగా బ్యాంకులకు బాసెల్‌-3 నిబంధనలను అమలు చేసేందుకు, అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరింత సమయం ఇవ్వడమనే నిర్ణయం ‍ప్రభుత్వ బ్యాంకులకు క్రెడిట్‌ నెగటివ్‌ చర్య అని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న పలు వివాదాల పరిష్కారం కోసం సోమవారం ఇరు వర్గాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌ అనంతరం.. ఇండియన్‌ బ్యాంకులకు బాసెల్‌-3 నిబంధనల అమలుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం మరింత సమయం ఇస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. క్యాపిటల్‌ కన్సర్వేషన్‌ బఫర్‌ కింద 0.625 శాతం అదనపు మూలధనాన్ని కలిగి ఉండాలని, దీనికి ఏడాది పాటు అంటే 2020 మార్చి 31 వరకు సమయమిస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకులు రుణ మంజూరు, మూలధన సంబంధిత నిబంధనలు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ స్వతంత్ర డైరెక్టర్‌ ఒకరు ఆర్‌బీఐపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిబంధనలు సడలించడం గమనార్హం. బ్యాంకింగ్‌ రంగంలో లిక్విడిటీని మెరుగుపరచాలని, చిన్న కంపెనీలకు రుణ సదుపాయాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులను ఉపయోగించుకొని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని చూస్తోంది. 
బాసెల్‌-3 నిబంధనలను అమలు పరించేందుకు గడువును మరో ఏడాది పొడిగించడమనేది ప్రభుత్వ రంగ బ్యాంకులకు క్రెడిట్‌ నెగటివ్‌ అని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ గ్రూప్‌) శ్రీకాంత్‌ వడ్లమని తెలిపారు. వచ్చే 12 నెలల కాలంలో పలు బ్యాంకుల వద్ద కోర్‌ క్యాపిటల్‌ ఉండాల్సిన స్థాయి కన్నా తక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. అలాగే చిన్న సంస్థలకు ఇచ్చిన రుణాల్లో మొండి బకాయిలుగా మారిన వాటిని పునరుద్ధరించాలనే పరిశీలనపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు గతంలో విఫలమయ్యాయని గుర్తు చేశారు. కాగా నిర్ధేశిత గడువులోగా బ్యాంకుల వద్ద క్యాపిటల్‌ కన్సర్వేషన్‌ బఫర్‌ 2.5 శాతంగా ఉండాలి. ప్రస్తుతం ఇది 1.875 శాతంగా ఉంది. You may be interested

ఇండియన్‌ బ్యాంక్‌ కొనొచ్చు..

Tuesday 20th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఇండియన్‌ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఇండియన్‌ బ్యాంక్‌ రేటింగ్‌ కొనొచ్చు ‍ప్రస్తుత ధర: రూ.229 టార్గెట్‌ ప్రైస్‌: రూ.335 ఆనంద్‌రాఠి.. ఇండియన్‌ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.335గా నిర్ణయించింది. బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బలహీనమైన ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. నిర్వహణ పనితీరు ఆకట్టుకోలేకపోయిందని తెలిపింది. ఎఐఐ వృద్ధి తక్కువగా ఉందని పేర్కొంది.

మెటల్‌ షేర్ల పతనం

Tuesday 20th November 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రపంచట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా 2శాతం నష్టపోయింది.  మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(3,395.35)తో పోలిస్తే 2శాతం నష్టంతో రూ.3,329.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 11 షేర్లు

Most from this category