STOCKS

News


జీడీపీ అంచనాలు తగ్గించిన ఆర్‌బీఐ

Thursday 6th June 2019
news_main1559815349.png-26138

2019-20 సంవత్సరానికి 7 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరజీడీపీ అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ జూన్‌ సమీక్షా సమావేశంలో ప్రకటించింది. 2019-20 సంవత్సరానికి జీడీపీ అంచనాను 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఏప్రిల్‌ సమావేశంలో ఆర్‌బీఐ తెలిపింది. తాజాగా మారోమారు జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. దేశీయ పెట్టుబడి కార్యకలాపాల్లో మందగమనం ఉత్పత్తి, దిగుమతుల్లో కనిపిస్తోందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం ప్రథమార్ధానికి జీడీపీ 6.4- 6.7 శాతం ఉండొచ్చని తెలిపింది. గతంలో ఈ అంచనా 6.8- 7.1 శాతం ఉండేది. ద్వితీయార్ధ అంచనాలను 7.3- 7.4 శాతం నుంచి 7.2- 7.5కు మార్చింది. తాజా సమావేశంలో రెపోరేట్‌ను తగ్గించడం ద్వారా వరుసగా మూడు మార్లు ఆర్‌బీఐ రేట్లు తగ్గించినట్లయింది. దీంతో పాటు ద్రవ్యోల్బణ అంచనాలను సైతం ఆర్‌బీఐ మార్చింది. తాజా తగ్గింపుతో రెపోరేటు 6 నుంచి 5.75 శాతానికి దిగివచ్చింది. రేట్‌కట్‌ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాలని ఆర్‌బీఐ కోరింది. ద్రవ్యోల్బణ అంచనాలను సైతం ఆర్‌బీఐ ఈ సమావేశంలో సమీక్షించింది. సంవత్సర ప్రథమార్ధ ద్రవ్యోల్బణ అంచనాను 2.9-3 శాతం నుంచి 3- 3.1 శాతానికి, ద్వితీయార్ధ అంచనాను 3.5-.3.8 శాతం నుంచి 3.4- 3.7శాతానికి మార్చింది. 



You may be interested

ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై రుసుముల తొలగింపు

Thursday 6th June 2019

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసే బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త ప్రకటించింది. ఆర్టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే నగదు బదిలీలపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు తెలిపింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బ్యాంకులు ఈ ప్రయోజనాలను తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆదేశించామని తెలిపింది.  దీంతో పాటు ఏటీఎం ఛార్జీలను కూడా

రేట్‌కట్‌ రుచించలేదా?

Thursday 6th June 2019

భారీగా పతనమైన సూచీలు తాజా సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ రెపోరేట్‌ను పావుశాతం తగ్గించడం, ధక్పథాన్ని న్యూట్రల్‌ నుంచి సర్దుబాటు(అకామిడేటివ్‌)కు మార్చడం చేసింది. ఆర్‌బీఐ చర్యలపై మార్కెట్ల ప్రాథమిక స్పందన నెగిటివ్‌గా ఉంది. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల మేర నష్టపోయాయి. మార్కెట్లు పావుశాతం రేట్‌కట్‌ను ముందే డిస్కౌంట్‌ చేశాయని, అంతకుమించి రేట్ల తగ్గింపు ఉంటే పాజిటివ్‌గా స్పందించిఉండేవని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు చర్యలను మార్కెట్లు

Most from this category