STOCKS

News


ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా ?

Wednesday 31st October 2018
news_main1540961545.png-21598

ఆర్బీఐ విధానాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వ్యవహారశైలితో  విసుగు చెందుతున్న ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్‌బీఐ గవర్నర్‌ను ముఖ్యమైన అంశాల్లో కేంద్ర ఆదేశించే అధికారాల్ని ఆర్‌బీఐ చట్టం ప్రకారం కేంద్రం సంక్రమింపచేసుకుందంటూ బుధవారం వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేయవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి.  ప్రభుత్వానికి, ఆర్‌బీఐ గవర్నర్‌కు మధ్య అంతరాలు పూడ్చలేని విధంగా మారనట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ తీసుకునే ప్రతి నిర్ణయంలో కలుగుజేసుకోవడం పరిపాటిగా మారింది. ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలంటూ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య ప్రకటన,  ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని తగ్గించే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘాలు లేఖ రాయడం తదితర కారణాలు ఆర్‌బీఐకు, కేంద్రం మధ్య జరుగుతున్న అంతర్గత విబేధాలను తేటతెల్లం చూస్తున్నాయి. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 బుధవారం కథనాలు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు ఉర్జిత్‌ పటేల్‌ అందుబాటులోకి లేరు.


RBI

You may be interested

హఠాత్తుగా పతనమైన సూచీలు

Wednesday 31st October 2018

ఆర్‌బీఐ, కేంద్రం విభేదాలతో మార్కెట్లో షాక్‌ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమైన భారత్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ మొదలైన గంట తర్వాత హఠాత్తుగా నెగిటివ్‌లోకి మళ్లింది. ఉదయం 10.20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్లు క్షీణించి 33,640 పాయింట్ల వద్దకు తగ్గగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్ల క్షీణతతో 10,108 పాయింట్ల స్థాయికి దిగింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 250 పాయింట్ల మేర పతనమై 25,555 పాయింట్ల స్థాయికి చేరింది.   

డాక్టర్‌ రెడ్డీస్‌కు యూఎస్‌ఎఫ్‌డీ షాక్‌

Wednesday 31st October 2018

3నెలల కనిష్టానికి పతనమైన షేరు ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌కు చెందిన షేరు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6.50శాతం నష్టపోయింది. విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉన్న ఫార్ములేషన్స్‌ తయారీ కేంద్రంలో యూఎస్‌ ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తి చేసింది. 8 రకాల ఉల్లంఘనలకు కంపెనీ పాల్పడినట్లు ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌, డ్రగ్‌, కాస్మెటిక్‌ యాక్ట్‌ కింద ఫామ్‌-483ని యూఎస్‌ఎఫ్‌డీ జారీ చేసినట్టు మంగళవారం డాక్టర్‌ రెడ్డీస్‌

Most from this category