STOCKS

News


చిరిగిన నోట్ల మార్పిడీ విధానాల్లో మార్పు!

Saturday 8th September 2018
news_main1536381557.png-20086

ముంబై: చిరిగిన నోట్ల మార్పిడీకి సంబంధించి విధి విధానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం సవరించింది. చిరిగిన లేక పాడైపోయిన 50 రూపాయలు ఆపైన డినామినేషన్స్‌ కరెన్సీ నోట్లకు పూర్తి విలువ పునఃచెల్లింపునకు సంబంధించి ‘‘పాడైపోయిన నోటు కనీసం ఎంత పరిమాణంలో ఉండాలి’’ అనే నిర్దేశాలను మార్చినట్లు  ఆర్‌బీఐ వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది.  పెద్ద నోట్ల అనంతరం రూ.2,000 సహా అంతకన్నా తక్కువ డినామినేషన్‌లో​ కొత్త నోట్లను వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన నేపథ్యంలో ‘పాడైపోయిన లేక చిరిగిపోయిన ఆయా నోట్ల మార్పిడికి అనుగుణంగా’ ఈ సవరణలు జరిగాయి. 2016 నవంబర్‌లో రూ.500, 1,000 నోట్లను రద్దు చేశారు. వెంటనే రూ.2,000 రూ.500 వ్యవస్థలో వచ్చాయి.  ఆపై క్రమంగా రూ. 100, రూ. 50, రూ. 20, రూ.10 రూ.5 కొత్త నోట్లూ వ్యవస్థలోకి విడుదలయ్యాయి. ప్రజలు చిరిగిన, పాడైపోయిన నోట్లను ఆర్‌బీఐ కార్యాలయాలు, నిర్దేశిత బ్యాంక్‌ బ్రాంచీల్లో కొత్తవాటితో మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పిడి పూర్తి విలువలో జరగాలా? లేక అందులో సగం విలువే లభిస్తుందా? అన్నది చిరిగిన లేదా పాడైపోయిన కరెన్సీని స్థితి ప్రకారం ఉంటుంది. అంటే ఒక చిరిగిన లేక పాడైపోయిన కరెన్సీ నోట్‌ను మీరు మార్చుకోదలచుకుంటే, అందుకు సంబంధించి దాని స్థితిని బట్టి మీకు ‘రిటర్న్‌  కరెన్సీ నోట్‌’ విలువ ఉంటుంది. తాజా నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయి. 



You may be interested

ప్రజా రవాణాను విద్యుత్‌తో నడిపిస్తారా...?

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ప్రజా రవాణా బస్సులను విద్యుత్‌తో నడిపించేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే వారికి అన్ని రకాల అనుమతులను పళ్లెంలో పెట్టి అందిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు నియంత్రణ పరమైన అవరోధాలను తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనుమతులు చాలా పెద్ద అవరోధంగా మారి, ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోయేందుకు దారితీస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మూవ్‌ సదస్సులో మాట్లాడుతూ... ప్రభుత్వరంగ రవాణా కార్పొరేషన్లు భారీ

రూ. 500 కోట్ల సమీకరణలో ఎయిరిండియా

Saturday 8th September 2018

ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు రూ. 500 కోట్ల మేర నిధులను స్వల్పకాలిక రుణాల రూపంలో సమీకరించాలని యోచిస్తోంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనుంది. సెప్టెంబర్‌లోనే ఒకే దఫాలో లేదా విడతలవారీగా ఈ నిధులను సమీకరించే అవకాశం ఉంది. బ్యాంకుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఎయిరిండియా ఈ మేరకు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 10లోగా బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్వహణ

Most from this category