STOCKS

News


రూ.లక్ష కోట్లకు పైగా ఖజానాకు..!

Tuesday 27th November 2018
news_main1543298591.png-22408

  • ఆర్‌బీఐ నుంచి బదిలీకి అవకాశం

ముంబై: రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.1 లక్ష కోట్లు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న 'మిగులు మూలధన నిల్వలను' ప్రత్యేక కమిటీ గుర్తించిన అనంతరం ఈ నిధులను బదిలీ చేసే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్‌ (బీవోఏఎంఎల్‌) ఒక నివేదికలో పేర్కొంది. "ఆర్‌బీఐ వద్ద ఉండతగిన మూలధన నిల్వల విధానాన్ని (ఈసీఎఫ్‌) రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సుమారు రూ.1- 3 లక్షల కోట్ల మేర మిగులును గుర్తించే అవకాశం ఉంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది సుమారు 0.5- 1.6 శాతానికి సమానం" అని వివరించింది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండతగిన అత్యవసర నిల్వలపై విధించే పరిమితులను బట్టి కేంద్రానికి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల కోట్ల దాకా బదిలీ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.



You may be interested

జెట్‌లో కొనసాగుతున్న ఉద్వాసనలు

Tuesday 27th November 2018

మరో 16 మంది ఉద్యోగుల తొలగింపు హైదరాబాద్‌ కార్యాలయం మూసివేత ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా మరో 16 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌, కొచి కార్యాలయాల్లో పని చేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. "జెట్ ఎయిర్‌వేస్ పరిమిత స్థాయిలో కొద్ది కొద్దిగా ఉ‍ద్యోగులను తొలగించడం

క్యూ2లో తగ్గనున్న వృద్ధి జోరు

Tuesday 27th November 2018

ఎస్‌బీఐ రిసెర్చ్‌ అంచనా అధికారిక గణాంకాలు శుక్రవారం న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-2019) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) మందగించే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ తెలిపింది. గ్రామీణ డిమాండ్‌ మందగమనం తమ అంచనాలకు కారణమని పేర్కొంది. వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 7.6 శాతం శ్రేణిలో నమోదయ్యే వీలుందని వివరించింది. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) స్థూల దేశీయోత్పత్తి

Most from this category