STOCKS

News


ఆర్‌బీఐ బోర్డు నిర్ణయాలు మంచివే: ఉదయ్‌కోటక్‌

Thursday 22nd November 2018
news_main1542863720.png-22289

ముంబై: ఆర్‌బీఐ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ స్వాగతించారు. ఆర్థిక రంగానికి ఇవి కచ్చితంగా మేలు చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాల పునరుద్ధరణ సహా పలు కీలక అంశాలపై ఆర్‌బీఐ బోర్డు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ వద్ద మిగుల నిల్వలు ఎంత ఉండాలన్న దానిని నిర్ణయించేందుకు నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయడానికి, బ్యాలన్స్‌ షీట్లు బాగులేని బ్యాంకుల విషయంలో నిబంధనల సరళీకరణ అంశాన్ని కూడా పరిశీలించేందుకు అంగీకరించింది. దీనిపై ఉదయ్‌కోటక్‌ స్పందిస్తూ... ఆర్‌బీఐ బోర్డు నిర్ణయాలను గౌరవిస్తానన్నారు. బలహీనమైన రిస్క్‌ నిర్వహణ అనేది ఆర్థిక సేవల రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా ఆయన పేర్కొన్నారు. 



You may be interested

వాట్సాప్‌ భారత్ చీఫ్‌గా అభిజిత్ బోస్‌

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ భారత విభాగం చీఫ్‌గా అభిజిత్‌ బోస్‌ను నియమించింది. వచ్చే ఏడాది తొలి నాళ్లలో ఆయన బాధ్యతలు చేపడతారని, గురుగ్రామ్ కేంద్రంగా ఆయన టీమ్ పనిచేస్తుందని వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న, పెద్ద సంస్థలను వాటి కస్టమర్లతో అనుసంధానించడంపై బోస్ టీమ్ ప్రధానంగా దృష్టి పెడుతుందని వాట్సాప్ సీవోవో మాట్ ఇడెమా తెలిపారు. 2011లో ఏర్పాటైన ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కంపెనీ ఈజీట్యాప్ వ్యవస్థాపకుల్లో

దేశీ పీసీ మార్కెట్‌ 20% వృద్ధి

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు, సామాన్య వినియోగదారుల సెగ్మెంట్‌లలో మెరుగైన డిమాండ్‌తో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విక్రయాలు ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 27.1 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 20.2 శాతం వృద్ధి చెందాయి. అయితే సీక్వెన్షియల్‌గా పెరిగినప్పటికీ, గతేడాది జూలై-సెప్టెంబర్‌ వ్యవధితో పోలిస్తే మాత్రం అమ్మకాలు సుమారు 10.6 శాతం తగ్గాయని రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఒక నివేదికలో వెల్లడించింది. గతేడాది క్యూ3లో

Most from this category