STOCKS

News


దాస్‌కు నేడే తొలి పరీక్ష!

Friday 14th December 2018
news_main1544763445.png-22918

న్యూఢిల్లీ: నూతన గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ ఆధ్వర్యంలో ఆర్‌బీఐ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం సమావేశం కాబోతుంది. ఈ సందర్భంగా సెంట్రల్‌ బ్యాంకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై డైరెక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురుకానున్నాయి. నవంబరు 19న జరిగిన గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిపై సమీక్ష జరగనుంది. డీమోనిటైజేషన్‌, జీఎస్టీ నిర్ణయాల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు ఉపశమనం కల్పించే చర్యలు, ఆర్‌బీఐ విధాన నిర్ణయాల్లో సెంట్రల్‌ బోర్డు పాత్రపైనా చర్చ జరగనుంది. ప్రస్తుత నిర్మాణంలో, ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉన్న బోర్డును ఆర్‌బీఐ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిని చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఒక్కరోజు రుణ చెల్లింపుల్లో విఫలమైనా దాన్ని ఎన్‌పీఏగా వర్గీకరించడం వంటి ఎన్నో కీలక అంశాల్లో ప్రస్తుతం బోర్డు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే, ఆర్‌బీఐ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం కావాలని, ఆర్బీఐ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిని కాపాడాలన్నది మాజీ గవర్నర్లు, నిపుణుల అభిప్రాయం. ఆర్‌బీఐ స్వతంత్రతను, విశ్వసనీయతను తాను కాపాడతానని గవర్నర్‌ బాధ్యతల తర్వాత దాస్‌ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సమయానుకూలంగా పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డుకు గవర్నర్‌ అధిపతిగా వ్యవహరిస్తారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, 11 ఇండిపెండెండ్‌ డైరెక్టర్లు ఉంటారు. ఆర్‌బీఐ గవర్నర్‌ బాధ్యతలు చేపట్టిన రెండోరోజే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో దాస్‌ సమావేశం కాగా, మూడో రోజు ఆర్‌బీఐ బోర్డు కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. You may be interested

ముకేశ్ అంబానీ రిటైల్ జోరు..

Friday 14th December 2018

జ్యుయలరీ నుంచి మొదలుపెడితే దుస్తులు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, పాదరక్షలు, నిత్యాసవర సరుకులు... ఇలా అన్నింటికీ వేరువేరు ఆఫ్‌లైన్‌ స్టోర్లు నిర్వహిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... ఈ బలాన్ని ఆన్‌లైన్‌కు ఉపయోగించుకోవటానికి సన్నాహాలు చేస్తోంది. వీటన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి తన మరో ప్రధాన ఆయుధమైన రిలయన్స్‌ జియోను ఎంచుకుంటోంది. ఇంటింటికీ జియో ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... దాని ద్వారానే ఆన్‌లైన్‌ వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల

ఐఓసీ షేర్ల బైబ్యాక్‌ @ రూ.4,435 కోట్లు

Friday 14th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ.4,435 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. అంతేకాకుండా రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని ఐఓసీ గురువారం తెలిపింది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌ను రూ.149 ధరకు బైబ్యాక్‌ చేయనున్నామని పేర్కొంది. ఈ బైబ్యాక్‌ ధర గురువారం ఐఓసీ షేర్

Most from this category