STOCKS

News


ఎన్‌పీఏల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల వరకూ...

Wednesday 24th October 2018
news_main1540360828.png-21432

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డ్‌ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్‌పీఏ) సహా బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో సంక్షోభం నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్‌ సమావేశం చర్చించింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌సహా  బోర్డ్‌లోని  పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్‌ మొదటివారంలో మరోసారి బోర్డ్‌ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది,. పేటీఎం లాంటి ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న కేంద్రం ఆలోచనను ఆర్‌బీఐ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజా బోర్డ్‌ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
 



You may be interested

అంబుజా సిమెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12.73 శాతం వృద్ధితో రూ.396 కోట్లు, ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.6,097 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.351 కోట్లు, ఆదాయం రూ.5,451 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా 12 శాతం పెరిగి రూ.5,540 కోట్లకు చేరాయి. జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా అంబుజా సిమెంట్స్‌

లిస్టెడ్ ఎయిర్‌లైన్స్‌కు రేటింగ్‌ సెగ

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు లిస్టెడ్ విమానయాన సంస్థలకు రేటింగ్‌పరమైన తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ సంస్థల రుణాలను వివిధ రేటింగ్ సంస్థలు అక్టోబర్‌లో కుదించాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) పొందిన దాదాపు రూ. 8,000 కోట్ల విలువ చేసే బ్యాంక్ ఫెసిలిటీస్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను అక్టోబర్ 17న ఇక్రా కుదించింది. స్వల్పకాలిక రేటింగ్‌ను యథాతథంగానే కొనసాగించింది. అటు నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఇటు వాటిని

Most from this category