News


మరో విడత రేటు పెంపు ఖాయం!

Thursday 27th September 2018
news_main1538023809.png-20624

బెంగళూరు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్‌ 5వ తేదీన జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను మరో పావుశాతం పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడవసారి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది.  ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, రూపాయి బలహీనత నేపథ్యంలో రేటు పెంపు వైపే ఆర్‌బీఐ మొగ్గుచూపే అవకాశం ఉందని ఒక వార్తా సంస్థ సెప్టెంబర్‌ 19 నుంచి 25 మధ్య   నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది వృద్ధి తగ్గుదలకు దారితీసే అంశమని కూడా వారు విశ్లేషిస్తున్నారు. ఇక డాలర్‌ మారకంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 15 శాతం బలహీనపడ్డ రూపాయి విధాన నిర్ణేతలకు ఆందోళక కలిగించే అంశమేనన్నది వారి విశ్లేషణ. కొందరి అభిప్రాయాలు చూస్తే...
 
 డీబీఎస్‌: రూపాయి బలహీనత నేపథ్యంలో- పాలసీ రేటు పెంపు ఆర్‌బీఐకి తప్పనిసరేనని, అయితే ఇక్కడ ఎప్పుడు పెంచుతారన్నదే కీలకమని సింగపూర్‌లో డీబీఎస్‌ ఎకనమిస్ట్‌ రాధికా రావు పేర్కొన్నారు.  
 రబోబ్యాంక్‌: భారత్‌ రెండవ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటును సాధించినప్పటికీ, దానికి ప్రధానంగా బేస్‌ ఎఫెక్ట్‌ కారణమవుతుందని రబోబ్యాంక్‌లో సీనియర్‌ ఎకనమిస్ట్‌ హుగో ఎర్కిన్‌ పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రస్తుతం భారత్‌ ముందున్న తీవ్ర సవాలని అన్నారు. ఇది కరెంట్‌ అకౌంట్‌పై ప్రతికూలత చూపే అంశంగా పేర్కొన్నారు. 
 ఐఎన్‌జీ: అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో- దేశీయంగానూ రేట్ల పెంపు తప్పని పరిస్థితి నెలకొంటోందని ఐఎన్‌జీలో ఆసియా ఆర్థిక వ్యవహారాల నిపుణులు ప్రకాశ్‌ శక్‌పాల్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ అక్టోబర్‌4వ తేదీన పావుశాతం రేటు పెంచినా, ఫెడ్‌ రేటుకు సంబంధించి పోల్చిచూస్తే, ఆ మేర రేటు పెంపు (పావుశాతం) తక్కువగనే భావించాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. You may be interested

ఖాతా ప్రారంభానికి ఆధార్‌ తప్పనిసరి కాదు: ఎస్‌బీఐ

Thursday 27th September 2018

ముంబై: సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని, అయితే.. ఖాతాదారులు స్వచ్ఛందంగా ఆధార్‌ సమర్పించవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆధార్‌ స్కీంను గొప్ప సౌకర్యంగా అభివర్ణించిన ఆయన.. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ‘ఆన్‌లైన్‌ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే ఖాతా ప్రారంభమవడమే కాకుండా,

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 సరికొత్త బైక్‌లు

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో రెండు సరికొత్త బైక్‌లు విడుదలకానున్నాయి. ట్విన్‌ సిలిండర్లు కలిగిన ఈ బైక్‌లు త్వరలోనే భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ లభ్యమవుతాయని కంపెనీ ప్రకటించింది. కాంటినెంటల్ జీటీ 650 పేరిట విడుదలకానున్న బైక్‌ ధర రూ.4,21,558 కాగా, ఇంటర్‌సెప్టర్ ఐఎన్‌టీ 650 పేరిట అందుబాటులోకి రానున్న మరో బైక్‌ ధర రూ.4,90,618 వద్ద

Most from this category