News


ఇది చారిత్రాత్మక బడ్జెట్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌

Saturday 2nd February 2019
news_main1549110510.png-23984

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ చారిత్రాత్మకమని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. స్వవలంబన, ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి చెందిన ‘నవ భారత్‌’ఏర్పాటు ప్రక్రియను ఈ బడ్జెట్‌ వేగవంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. ‘ఈ చారిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి గోయల్‌ను అభినందిస్తున్నా. ఈ బడ్జెట్‌లో కేవలం అభివృద్ధి గురించే కాకుండా సమాజంలోని మధ్యతరగతి ప్రజలు, రైతులు, అసంఘటిత రంగంలోని కార్మికులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2030 నాటికి భారత్‌ను 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న దార్శనికతకు ఈ బడ్జెట్‌ అద్దం పట్టింది. రూ.5 లక్షల వరకూ ఆదాయపుపన్నును మినహాయించడం, మరో రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడి మినహాయింపులు కల్పించడం మధ్యతరగతి ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపనుంది. గతంలో ప్రభుత్వాలు రైతులకు తాయిలాలు అందించేవి. కానీ కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలను నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. దీనివల్ల రైతులకు శాశ్వత ఆదాయం లభిస్తుంది. ఇందుకోసం 2019-20 బడ్జెట్‌లో రూ.20,000 కోట్లు కేటాయించాం’అని రాజ్‌నాథ్‌ తెలిపారు. రక్షణ, వ్యవసాయం, మౌలికవసతులు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, ఇంధన రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్‌ ఉందని వ్యాఖ్యానించారు.You may be interested

పర్యావరణానికి రూ.3,111 కోట్లు

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: పర్యావరణ మంత్రిత్వ శాఖకు మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ప్రాజెక్టు టైగర్‌కు రూ.350 కోట్లు, ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(సీపీసీబీ)కి రూ.100 కోట్లు, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువ అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్‌

విద్యారంగానికి రూ.93,847 కోట్లు

Saturday 2nd February 2019

ఉన్నత విద్యకు రూ.37,461 కోట్లు, పాఠశాల విద్యకు రూ.56,386 కోట్లు గత ఏడాది కన్నా 10 శాతం అధికం న్యూఢిల్లీ: విద్యారంగానికి 2019-20 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్‌ కంటే 10 శాతం అధికం. ఈ బడ్జెట్‌లో రూ.37,461.01 కోట్లు ఉన్నత విద్యకు, 56,386.63 కోట్లు పాఠశాల విద్యకు కేటాయించింది. గత ఏడాది రూ.85,010 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. శుక్రవారం ఆర్థిక మంత్రి పీయుష్‌ గోయల్‌

Most from this category