STOCKS

News


ఇది రైతులను అవమానించడమే

Saturday 2nd February 2019
news_main1549110162.png-23982

  • బడ్జెట్‌పై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ రైతుల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం’కింద ఇప్పుడు ఒక్కో రైతుకు రోజుకు రూ.17 చొప్పున ఇస్తామంటూ అన్నదాతలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశం అనంతరం రాహుల్‌ స్పందిస్తూ..‘రైతులకు ఏటా రూ.6,000 ఇస్తామని మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ప్రియమైన మోదీజీ.. గత ఐదేళ్లలో మీ చేతకానితనం, మూర్ఖత్వం కారణంగా మన రైతుల జీవితాలు నాశనమైపోయాయి. రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అంటే రోజుకు రూ.16.44 ఇస్తామని చెప్పడం వారిని అవమానించడమే’అని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌ను ఎన్డీయే ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌గా అభివర్ణించడంపై మాట్లాడుతూ.. ఇంకో రెండు నెలల్లో రఫేల్‌ ఒప్పందం, ఉద్యోగాలు, నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరుగుతాయని చురకలు అంటించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రైతున్నల సమస్యలు, నిరుద్యోగిత, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, మోదీ అవినీతి ప్రధాన అంశాలుగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.You may be interested

విద్యారంగానికి రూ.93,847 కోట్లు

Saturday 2nd February 2019

ఉన్నత విద్యకు రూ.37,461 కోట్లు, పాఠశాల విద్యకు రూ.56,386 కోట్లు గత ఏడాది కన్నా 10 శాతం అధికం న్యూఢిల్లీ: విద్యారంగానికి 2019-20 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్‌ కంటే 10 శాతం అధికం. ఈ బడ్జెట్‌లో రూ.37,461.01 కోట్లు ఉన్నత విద్యకు, 56,386.63 కోట్లు పాఠశాల విద్యకు కేటాయించింది. గత ఏడాది రూ.85,010 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. శుక్రవారం ఆర్థిక మంత్రి పీయుష్‌ గోయల్‌

టెలికం నుంచి రూ. 41వేల కోట్ల ఆదాయ అంచనా

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో టెలికం రంగం నుంచి రూ. 41519. 76 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఏడాది టెలికం రంగ రెవెన్యూ కన్నా ఇది కాస్త అధికం. 2018-19లో టెలికం రంగం నుంచి రూ. 48661కోట్ల ఆదాయం ఉంటుందని ప్రభుత్వం గత బడ్జెట్లో అంచనా వేసింది. కానీ ప్రస్తుతం ఈ మొత్తం రూ. 39245 కోట్లకు పరిమితమయింది. ఆపరేటర్ల నుంచి లైసెన్సు

Most from this category