STOCKS

News


అసమానతలను నిర్లక్ష్యం చేస్తే అనర్ధమే

Wednesday 13th March 2019
news_main1552458535.png-24575

- ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు

ముంబై: ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల్లో పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్లక్ష్యం చేస్తే అనర్ధాలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీ కూడా అసమానతలకు కారణంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఓవైపు ఆటోమేషన్ మూలంగా కొన్ని ఉద్యోగాల్లో కోత పడుతుండగా, మరోవైపు ఏదైనా ఎక్కడైనా ఉత్పత్తిచేయడం సాధ్యపడుతుండటంతో అప్పటిదాకా వాటి తయారీపైనే ఆధారపడిన సామాజిక వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. "ఆయా వర్గాలు తమ ఆర్థిక ఆసరాను కోల్పోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జనాకర్షక కార్యక్రమాలతో రాజకీయనాయకులు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా సామాజిక అసమానతల పరిష్కారానికి విరుగుడుగా జనాకర్షక విధానాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటం పెట్టుబడిదారీ వ్యవస్థకు ముప్పుగా పరిణమించనుంది" అని ఆయన పేర్కొన్నారు.
దేశ సమైక్యత, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ, సామాజిక.. ఆర్థిక అభివృద్ధి అంశాల్లో అందించిన సేవలకు గాను యశ్వంత్‌రావ్ చవాన్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వీడియో లింక్ ద్వారా రాజన్ ఈ విషయాలు పేర్కొన్నారు. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించడం ద్వారా కొంత మేర అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నం చేయొచ్చన్నారు. వెనకబడిపోయిన వర్గాలు టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. You may be interested

డోర్ల తయారీలోకి ఎన్‌సీఎల్‌!

Wednesday 13th March 2019

- డ్యూరాడోర్‌ బ్రాండ్‌తో వ్రియాలు - రూ.50 కోట్లతో తయారీ యూనిట్‌ - చౌటుప్పల్‌లో నేడే ప్రారంభం - ఈ ఏడాదే విద్యుత్‌ ప్లాంటు కూడా - ‘సాక్షి’తో ఎన్‌సీఎల్‌ ఎండీ కె.రవి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ ఎన్‌సీఎల్‌ గ్రూప్‌ ప్రీమియం డోర్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. టర్కీకి చెందిన ఏజీటీ సాంకేతిక సహకారంతో ‘డ్యూరాడోర్’ బ్రాండ్‌ కింద కంపెనీ వీటిని లైఫ్‌టైం వారంటీతో విక్రయించనుంది. దీనికోసం హైదరాబాద్‌ సమీపంలోని చౌటుప్పల్‌ వద్ద రూ.50

'ప్రాంతీయ' స్టార్టప్స్‌పై ఇన్వెస్టర్ల గురి

Wednesday 13th March 2019

- బీటా స్టేజ్‌లోనే ఉన్నా ఆసక్తి - లిస్టులో బుల్‌బుల్, సిమ్‌సిమ్, డీల్‌షేర్‌ తదితర సంస్థలు - జోరుగా నిధులు సమీకరణలో స్టార్టప్స్‌ బెంగళూరు: వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు తాజాగా ప్రాంతీయ భాషల్లో ఈ–కామర్స్‌ సేవలందించే స్టార్టప్స్‌పై ఆసక్తి చూపుతున్నాయి. కొత్తగా ఈ–కామర్స్‌ మార్కెట్‌కు పరిచయం కాబోయే 10 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్స్‌కి ముందుగా చేరువయ్యే సత్తా గల సంస్థలపై ఇవి దృష్టి సారిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి బడా ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో షాపింగ్‌

Most from this category