STOCKS

News


7 శాతం వృద్ధి రేటు అనుమానమే!

Wednesday 27th March 2019
Markets_main1553665942.png-24823

- ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌
రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్య
- గణాంకాలపై సందేహాలు
తొలగాలని వ్యాఖ్య
- ఇందుకు నిష్పాక్షిక కమిటీ 
అవసరమనీ సూచన

న్యూఢిల్లీ: భారత్‌ ఏడు శాతం వృద్ధి రేటు సాధనపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి గణాంకాలపై ఉన్న సందేహాలను తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తగిన ఉద్యోగాల కల్పన జరగని పరిస్థితుల్లో 7 శాతం వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గణాంకాల విషయంలో నెలకొన్న అనుమానాలను తొలగించడానికి నిష్పక్షపాత కమిటీ ఏర్పాటు అవసరమనీ ఆయన సూచించడం గమనార్హం. భారత్‌ వాస్తవ వృద్ధిని కనుగొనడానికి గణాంకాల మదింపు ప్రక్రియ  పునర్‌వ్యవస్థీకరణ అవసరం అన్నారు. సెప్టెంబర్‌ 2013 నుంచి సెప్టెంబర్‌ 2016 వరకూ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజన్‌, తాజాగా ఒక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- నాతో ఇటీవల ఒక మంత్రి (నరేంద్రమోదీ ప్రభుత్వంలో) మాట్లాడారు.  తగిన ఉపాధి కల్పన లేనప్పుడు మనం ఎలా 7 శాతం వృద్ధి సాధించగలమని ఆయన అడిగారు. ఈ కారణాన్ని చూపిస్తే, మనం ఏడు శాతం వృద్ధిని సాధించే అవకాశం కనపించడం లేదు. (అయితే ఆయనతో మాట్లాడిన మంత్రి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు)
- వృద్ధి రేట్ల సమీక్ష అనంతరం, ఆయా గణాంకాల పట్ల అనుమానాలు పెరిగాయి. వీటిమీద సందేహాలు తొలగాలి. ఇందుకు సంబంధించి నిష్పాక్షిక కమిటీ ఏర్పడాలి. గణాంకాల పట్ల విశ్వాసం మరింత పెరగాలి.  అయితే నిష్పాక్షిక కమిటీ వేరే గణాంకాలు ఇస్తుందని కాదు. ఆ కమిటీ అవే సంఖ్యలను తిరిగి ఇవ్వవచ్చు. అయితే మన జీడీపీ సంఖ్యల పట్ల మనకు మరింత విశ్వాసం పెరుగుతుంది. (2018 నవంబర్‌లో కేంద్ర గణాంకాల శాఖ కాంగ్రెస్‌ హయాంలోని యూపీఏ కాలంలో జీడీపీ వృద్ధిరేట్లను తగ్గించింది. మోదీ ప్రభుత్వ పాలనలో గడచిన నాలుగేళ్ల జీడీపీ వృద్ధి రేట్లను యూపీఏ కాలంలో సాధించిన వృద్ధిరేట్లకన్నా ఎక్కువగా సవరించింది). 
- వివాదాస్పద నోట్ల రద్దు వంటి తన నిర్ణయాల వల్ల జరిగిన మంచి చెడులను ప్రభుత్వం సమీక్షించి, మున్ముందు ఎటువంటి తప్పులూ జరక్కుండా చూసుకోవాలి. స్వయం పరీక్ష మరింత సమర్థవంతమైన పాలనకు దోహదపడుతుంది. 

 You may be interested

ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించిన ఎల్‌ అండ్‌ టీ

Wednesday 27th March 2019

-ఒక్కో షేర్‌కు రూ.980 ధర -ఇది అవాంఛనీయ ఓపెన్‌ ఆఫర్‌ -బైబ్యాక్‌ను పక్కన పెట్టిన మైండ్‌ట్రీ  మైండ్‌ ట్రీ కంపెనీ  టేకోవర్‌లో భాగంగా ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.980కు (మం‍గళవారం ముగింపు ధర, రూ.950 కంటే ఇది రూ.30 అధికం) కొనుగోలు చేస్తామని ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా  31 శాతం వాటాకు

కొత్త ఇన్వెస్టర్‌ రూ.4,500 కోట్లు తేవాలి

Wednesday 27th March 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణకు ఈ మేరకు అవసరం న్యూఢిల్లీ: నిధుల కటకటతో బ్యాంకుల ఆధీనంలోకి వెళ్లిన జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణకు కొత్త ఇన్వెస్టర్‌ కనీసం రూ.4,500 కోట్లను తీసుకురావాల్సి ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 26 బ్యాంకుల కమిటీ వచ్చే నెలలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ చక్కని సంస్థ అని, ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు రజనీష్‌

Most from this category