STOCKS

News


అంతంత మాత్రంగానే ఆర్థిక ఫలితాలు

Tuesday 26th February 2019
Markets_main1551156475.png-24335

-ఆదాయ వృద్ధి, మార్జిన్ల పరంగా క్యూ2నే మేలు 
-నిలకడగా వృద్ధి సాధిస్తున్న గ్రామీణ డిమాండ్‌
ఇక్రా నివేదిక వెల్లడి 

ముంబై: భారత్‌లోని కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.   మార్జిన్లు, ఆదాయ వృద్ధి విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికమే మేలని  ఇక్రా తాజా నివేదిక వివరించింది. అయితే ఆదాయ వృద్ధి విషయంలో గత ‍క్యూ3 విషయంలో ఈ క్యూ3 బావుందని పేర్కొంది. కంపెనీల క్యూ3 ఫలితాలపై ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., 


-ఈ క్యూ2లో 648 లిస్టెడ్‌ కంపెనీల ఆదాయ వృద్ధి 19.4 శాతంగా ఉంది. ఇది ఈ క్యూ3లో 17.3 శాతానికి తగ్గింది. గత క్యూ3లో ఇది 9.8 శాతంగానే ఉంది. 
- ఈ క్యూ2లో నిర్వహణ మార్జిన్లు 16.6 శాతంగా ఉండగా, ఈ క్యూ3లో 16.4 శాతానికి తగ్గింది. గత క్యూ3లో 17.1 శాతంగా ఉంది. 
-రూపాయి పతనం ప్రతికూల ప్రభావం, ఇంధన, ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల మార్జిన్లు తగ్గాయి. 
-ఇంధన ధరలు పెరగడం వల్ల విమానయాన, సిమెంట్‌, బిల్డింగ్‌ మెటీరియల్స్‌ కంపెనీల మార్జిన్లు తగ్గాయి. 
-ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల వాహన, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, పెయింట్స్‌, మీడియా కంపెనీల మార్జిన్లు పడిపోయాయి. 
-వినియోగ కంపెనీల ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వాహన విక్రయాలు తగ్గగా, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌ కంపెనీల అమ్మకాలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. 
-​‍​‍గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ నిలకడగా కొనసాగనున్నది. పట్టణ వృద్ధి కంటే కూడా గ్రామీణ వృద్ధిదే పైచేయి కానున్నది. 
-కనీస మద్దతు ధర పెంపు, ఎన్నికల నేపథ్యంలో తాయిలాల కారణంగా గ్రామీణ వృద్ధి జోరు కొనసాగగలదు. 
-ఐటీ రంగానికి కీలకమైన బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవల విభాగం జోరు, డిజిటల్‌ రంగంలో వృద్ధి కారణంగా ఐటీ కంపెనీల ఆదాయం 8.3 శాతం (డాలర్లపరంగా) పెరిగింది. అయితే రూపాయి పతనమైనప్పటికీ ఐటీ కంపెనీల మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఐటీ కంపెనీలు డిజిటల్‌ విభాగంపై అధికంగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి కారణం. 
-నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడం, కొత్త ఆర్డర్ల జోరు కారణంగా స్టీల్‌, సిమెంట్‌ వినియోగం పెరిగింది. స్టీల్‌ కంపెనీలు 8 శాతం, సిమెంట్‌ కంపెనీలు 13 శాతం చొప్పున వృద్ధి చెందాయి.



You may be interested

సంక్షోభం నుంచి బైటపడేందుకు జెట్ కసరత్తు

Tuesday 26th February 2019

రుణపరిష్కార ప్రణాళిక ఖరారుపై దృష్టి మళ్లీ లాభాల్లోకి మళ్లుతామని ధీమా     న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి బైటపడేందుకు ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకులు రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేసేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రణాళిక అమలు ద్వారా మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని ధీమా వ్యక్తం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్ నరేశ్ గోయల్‌ , సంస్థలో

సింగ్ సోదరులను అరెస్ట్ చేయండి

Tuesday 26th February 2019

మాజీ ప్రమోటర్లపై సెబీకి ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వినతి రూ. 472 కోట్ల రికవరీ కోసం చర్యలకు విజ్ఞప్తి న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్‌ సింగ్, శివీందర్‌ సింగ్‌ సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్ సోదరులిద్దరు నిర్ణీత గడువులోగా రూ. 472 కోట్లు చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో వారి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఫోర్టిస్ హెల్త్‌కేర్ సంస్థ కోరింది. చట్టపరమైన చర్యలు

Most from this category