STOCKS

News


రెండవ త్రైమాసికంలో జీడీపీ డౌన్‌?

Wednesday 21st November 2018
news_main1542776171.png-22250

ముంబై: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) తగ్గే అవకాశం ఉందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రేటు దాదాపు 7.2 శాతంగా నమోదయ్యే వీలుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల మందగమనం దీనికి కారణమని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున సెప్టెంబర్‌ త్రైమాసికం అధికారిక గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో తాజా ఫలితాలు వెలువడ్డాయి. నివేదికలోని ముఖ్యాంశాలు ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త ఆదితి నాయర్‌ మాటల్లో...
♦ జూన్‌ త్రైమాసికంతో పోల్చితే, సెప్టెంబర్‌తో ముగిసే మూడు నెలల కాలంలో పారిశ్రామిక రంగం వృద్ధి 10.3 శాతం నుంచి 7.1 శాతానికి పడే అవకాశం ఉంది. 
♦ ప్రత్యేకించి తయారీ రంగం వృద్ధి రేటు 13.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గే వీలుంది. 
♦ ఇక వ్యవసాయ రంగంలో వృద్ధి స్పీడ్‌ కూడా 5.3 శాతం నుంచి 3.5 శాతానికి - పడుతుందని అంచనా. 
♦ సేవల రంగంలో వృద్ధి మాత్రం 7.3 శాతం నుంచి 7.8 శాతానికి పెరగవచ్చు. 
♦ అయితే అధిక కమోడిటీ ధరల వల్ల మైనింగ్ అండ్‌ క్వారియింగ్‌ రంగం 0.1 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగే వీలుంది. 
♦ విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు, నిర్మణ రంగం విభాగాలు సైతం మందగమనంలోకి జారే అవకాశం ఉంది. 
♦ క్రూడ్‌ అధిక ధర, డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గడానికి ‍కారణం. ఇక కొన్ని ప్రాంతాల్లో తగిన వర్షపాతం నమోదుకావడం మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలతో పంట నష్టం వ్యవసాయ రంగానికి ప్రతికూలంగా మారుతోంది. 
♦ వరుస త్రైమాసికాలను చూస్తే, కంపెనీల పన్ను అనంతరం మార్జిన్లు తగ్గాయి. ముడి పదార్థాలు, ఇంధన ధరలు పెరగడం, రూపాయి బలహీనత దీనికి కారణాలు. 



You may be interested

62 డాలర్లకు పతనమైన బ్రెంట్‌ క్రూడ్‌

Wednesday 21st November 2018

4.43 డాలర్ల క్షీణత డిసెంబర్‌ 2017 స్థాయికి పతనం ముడిచమురు ధరలు ఏడాది కనిష్టస్థాయికి పతనమయ్యాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) తీసుకుంటున్న నిర్ణయాలు ఫలించవనే అంచనాల నేపథ్యంలో యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్ ధర 3.77 శాతం పతనమై 53.43 డాలర్లకు తగ్గింది. జనవరి 19తో ముగిసే ఫ్యూచర్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 52.77 కనిష్టానికి పతనమైంది. ఇది అక్టోబర్‌ 2017 నాటి ధర కాగా, గతేడాదిలో నమోదైన

అలా అయితే... పాన్‌ దరఖాస్తులో తండ్రి పేరు అక్కర్లేదు

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌)కు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి తల్లే సింగిల్‌ పేరెంట్‌ అయితే, సంబంధిత వ్యక్తి పాన్‌ దరఖాస్తులో తండ్రిపేరు అక్కర్లేదు. ఆదాయపు పన్ను నిబంధనలను సవరిస్తూ, ప్రత్యక్ష పన్నల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫి‍కేషన్‌ జారీ చేసింది. సవరణలకు అనుగుణంగా దరఖాస్తులో మార్పూ ఉంటుంది. దరఖాస్తుదారుల తల్లిపేరు మాత్రమే సమర్పించడానికి ఈ తాజా దరఖాస్తు వీలు కల్పిస్తుంది. తాజా నిబంధన

Most from this category