STOCKS

News


ఏటీఎంలు మూతపడవు: కేంద్ర ఆర్థిక శాఖ

Saturday 15th December 2018
news_main1544848512.png-22945

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు సగం వరకు మూతపడే పరిస్థితి నెలకొందనే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన ఏటీఎంలైతే ఇప్పటివరకు మూసివేసే దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్ శుక్లా స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ 30 నాటికి దేశంలో మొత్తం 2.21 లక్షలు ఉండగా.. వీటిని షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు నిర్వహిస్తున్నారని లోక్‌ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇవేకాక మైక్రో ఏటీఎం వంటి ఇతరాత్ర సేవలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే మార్చినాటికి దేశంలోని 1.13 లక్షల ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) పేర్కొనగా.. ఈ అంశంపై ఆర్థిక శాఖ తాజా వివరణ ఇచ్చింది. మరోవైపు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.88,139 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం సమకూర్చిందని తెలియజేసిన ఆయన.. ప్రస్తుత ఏడాదిలో రూ.65,000 కోట్లకు బడ్జెట్‌ కేటాయింపు జరిగినట్లు తెలిపారు. రీక్యాపిటలైజేషన్‌ ప్రకటన జరిగిననాటి నుంచి ఈఏడాది నవంబర్‌ వరకు రూ.1,28,861 కోట్ల మూలధనాన్ని సమకూర్చామని, ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నామని తెలియజేశారు.



You may be interested

సెంట్రల్‌ బ్యాంకులకు నిర్వహణ స్వతంత్రత అవసరం

Saturday 15th December 2018

వాషింగ్టన్‌: తమ బాధ్యతల నిర్వహణ విషయంలో సెంట్రల్‌ బ్యాంకులకు నిర్వహణపరమైన స్వతంత్రత అన్నది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డైరెక్టర్‌ జెర్రీరైస్‌ అన్నారు. ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాతో భారత ఆర్‌బీఐ స్వతంత్రత విషయమై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా, రైస్‌ స్పందించడం గమనార్హం. కొన్ని అంశాల విషయంలో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య కొంత కాలంగా విభేదాలు నెలకొనడం, ఉర్జిత్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడం

రేట్ల కోతకు అవకాశం: కోటక్‌ ఈక్విటీస్‌

Saturday 15th December 2018

సానుకూల స్థూల ఆర్థిక డేటా కారణంగా సమీప భవిష్యత్తులో కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించేందుకు అవకాశం ఉందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. నవంబర్‌లో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.3 శాతంగా నమోదు కావడంతో, రానున్న ఫిబ్రవరి భేటీలో ఆర్‌బీఐ ఎంపీసీ తన విధానాన్ని సడలించొచ్చని కోటక్‌ అంచనా వేసింది. ‘‘ఆర్‌బీఐ రేట్లను తగ్గించే ముందు తన విధానాన్ని తటస్థానికి మార్చొచ్చు. ద్రవ్యోల్బణం తాజాగా మరింత తగ్గడం అన్నది ఫిబ్రవరి

Most from this category