STOCKS

News


ప్రభుత్వరంగ బ్యాంకులకు అతిత్వరలో రూ.28,615 కోట్లు

Friday 28th December 2018
news_main1545970183.png-23271

న్యూఢిల్లీ: అతి త్వరలోనే ఏడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం రూ.28,615 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ నెలాఖరులోపు రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల జారీ ద్వారా దీన్ని పూర్తి చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల బ్యాంకులు నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నాయి. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.10,086 కోట్ల సాయం లభించనుంది. ఆ తర్వాత ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌కు రూ.5,500 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రకు రూ.4,498 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.3,056 కోట్లు, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.2,159 కోట్ల మేర సాయం లభిస్తుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం మీద రూ.65,000 కోట్ల నిధులను అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందులో రూ.23,000 కోట్లను ఇప్పటికే సాయం అందించగా, మరో రూ.42,000 కోట్లను సమకూర్చాల్సి ఉంది. అయితే, రూ.41,000 కోట్ల సాయానికి సంబంధించి ఈ నెల 20న కేంద్రం పార్లమెంటు అనుమతి కోరడం గమనార్హం. ప్రభుత్వం అందించే నిధులతో బ్యాంకుల రుణ వితరణ సామర్థ్యం పెరుగుతుందని, ఆర్‌బీఐ కచ్చితమైన కార్యాచరణ (పీసీఏ) పరిధి నుంచి బయటకు వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటుకు తెలిపారు. 21 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 11 బ్యాంకులు ఆర్‌బీఐ పీసీఏ పరిధిలో (నిర్వహణపరమైన ఆంక్షలు) ఉన్నాయి.



You may be interested

తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!

Friday 28th December 2018

పృథ్వీ 3ని రూపొందించిన సాంఖ్య ల్యాబ్స్‌ 5జీ కనెక్షన్లకు, కాల్‌ డ్రాప్స్‌ నియంత్రణలో ఉపయోగం హైదరాబాద్‌: కాల్‌ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్‌సెట్‌ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్‌, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా

10800 పైన ప్రారంభమైన నిఫ్టీ

Friday 28th December 2018

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల అండతో శుక్రవారం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది.  సెన్సెక్స్‌ 150 పాయిం‍ట్ల లాభంతోనూ, నిఫ్టీ 10,800 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి డాలర్‌ మారకంలో రూపాయి(20పైసలు లాభం) బలపడటం సూచీలకు ఉత్సాహానిచ్చింది. ఉదయం గం.9:25 ని.లకు సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 36వేల పైన 36,029 వద్ద, నిఫ్టీ సూచి 67.55 పాయింట్లు పెరిగి 10,847.35 ‍వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలోని ఒక్క ఎఫ్‌ఎంజీసీ సూచి

Most from this category