STOCKS

News


రవాణా వ్యయాలు తగ్గింపుపై దృష్టి: ప్రభు

Friday 23rd November 2018
news_main1542949253.png-22339

న్యూఢిల్లీ: సరుకులు వేగంగా రవాణా అయ్యేందుకు, రవాణా లావాదేవీల వ్యయాలను తగ్గించేందుకు నూతన సమగ్ర రవాణా విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. రైలు, రోడ్డు, నౌక, వాయు రవాణా వ్యవస్థలను అనుసంధానించే విధంగా ఈ విధానం ఉంటుందన్నారు. రవాణాను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఓ పోర్టల్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టు ఢిల్లీలో జరిగిన సిల్ట్‌ ఎక్స్‌పో 2019 సందర్భంగా మంత్రి ప్రకటించారు. దేశంలో సరుకుల రవాణా వ్యయాలు జీడీపీలో 14 శాతంగా ఉన్నాయని, అదే అభివృద్ధి చెందిన దేశాల్లో 7-8 శాతమే ఉన్నట్టు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్‌ పరిశ్రమ స్థాయి 215 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని, ఇది ఏటా 10 శాతం పెరుగుతున్నట్టు చెప్పారు. 



You may be interested

చిన్న సంస్థలకు పాత పీసీల భారం

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు (ఎస్‌ఎంబీ) నాలుగేళ్ల పైబడిన పర్సనల్‌ కంప్యూటర్స్‌ భారంగా మారుతున్నాయి. వీటి మెయింటెనెన్స్‌కి ఒక్కో దానిపై దాదాపు రూ. 93,500 దాకా ఖర్చవుతోంది. ఈ డబ్బుతో కొత్తగా మరో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కంప్యూటర్లు కొనుక్కోవచ్చు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాతబడిన డివైజ్‌ల వల్ల ఉత్పాదకత నష్టం, పొంచి ఉన్న సెక్యూరిటీ రిస్కులు

అపోలో టైర్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: అపోలో టైర్స్‌ కంపెనీకి ఐదేళ్ల పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు అపోలో టైర్స్‌ కంపెనీ సచిన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక సెలబ్రిటిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా కుదుర్చుకోవడం ఇదే మొదటిసారని అపోలో టైర్స్‌ తెలిపింది. సచిన్‌ టెండూల్కర్‌తో అనుబంధం తమకు ప్రయోజనం కలిగిస్తుందని కంఎనీ వైస్‌ చైర్మన్‌, ఎమ్‌డీ నీరజ్‌ కన్వర్‌ పేర్కొన్నారు. భారత్‌లో ఇండియన్‌ సూపర్‌  లీగ్‌లో చెన్నియన్‌

Most from this category