STOCKS

News


చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం

Saturday 30th March 2019
Markets_main1553935817.png-24880

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుతం లభిస్తున్న వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సంమృద్ధి యోజనసహా అన్ని పొదుపు పథకాలపై ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో యథాపూర్వ వడ్డీరేట్లు కొనసాగుతాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా మూడు నెలలకు ఒకసారి పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సమీక్షించి ఆయా రేట్ల కొనసాగింపు లేదా మార్పులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 



You may be interested

పీఎన్‌బీ హౌసింగ్‌లో వాటా విక్రయించిన పీఎన్‌బీ

Saturday 30th March 2019

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాను జనరల్‌అట్లాంటిక్‌, వర్డె పార్టనర్స్‌ సంస్థలకు రూ. 1851 కోట్లకు విక్రయించనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. విక్రయంలో భాగంగా ఇరు సంస్థలు చెరో 1.09 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్‌ షేర్లను రూ. 850 చొప్పున కొనుగోలు చేస్తాయి. ఈ విలువ ప్రకారం పీఎన్‌బీ హౌసింగ్‌ మొత్తం విలువ రూ. 926 కోట్లకు చేరుతుంది. విక్రయానంతరం పీఎన్‌బీకి హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటా 32.79 శాతం నుంచి

ఆషామాషీ ర్యాలీ కాదు!

Saturday 30th March 2019

బ్యాంకు నిఫ్టీ మద్దతుతో నిఫ్టీ సైతం మంచి ర్యాలీ జరిపిందని, ఇది ఆషామాషీ ర్యాలీ కాదని ప్రముఖ ఇన్వెస్టర్‌ కునాల్‌ బోత్రా చెప్పారు. నిఫ్టీకి 11400- 11500 పాయింట్ల వద్ద బలమైన మద్దతుందన్నారు. ఈ దఫా పీఎస్‌యూ బ్యాంకులు సైతం భారీగా ర్యాలీ జరపడమే బ్యాంకు నిఫ్టీలో అంత పెద్ద ర్యాలీకి అవకాశమిచ్చిందన్నారు. గతంలో కూడా పీఎస్‌యూ బ్యాంకులు మంచి ర్యాలీ జరిపాయని, కానీ అవేమీ ఎక్కువకాలం నిలబడలేదని తెలిపారు.

Most from this category