News


సెప్టెంబర్‌లో ‘తయారీ’ జోష్‌

Monday 1st October 2018
news_main1538380361.png-20754

ఆగస్ట్‌ నెలలో అనూహ్యంగా నెమ్మదించిన భారత్‌ తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మళ్లీ పుంజుకుంది. కొత్త ఆర్డర్లు పెరగడం, ఉత్పత్తి ఎగయడం, ఉపాధి కల్పన మెరుగుపడటం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఈ విషయాన్ని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, బలమైన అమెరికా డాలర్‌, సరఫరా తగ్గుదల, క్రూడ్‌ ధరలు ఎగయడం వంటి అంశాల వల్ల ధరల ఒత్తిడి పెరిగిందని పేర్కొంది. దీనివల్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపింది. 
ఆగస్ట్‌లో మూడు నెలల కనిష్ట స్థాయి 51.7కు పడిపోయిన పీఎంఐ ఇండెక్స్‌ సెప్టెంబర్‌లో 52.2కు పెరిగింది. దేశీ, విదేశీ క్లయింట్స్‌ నుంచి డిమాండ్‌ పెరడటం ఇందుకు ప్రధాన కారణం. కాగా నికాయ్‌ ఇండెక్స్‌ 50పైన సూచీ ఉంటే దీనిని వృద్ధి ధోరణిగానే భావించాల్సి ఉంటుంది. అటులోపుకు పడిపోతేనే క్షీణతగా పరిగణలోకి తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ 50 పాయింట్‌ మార్క్‌కు పైనే ఉండటం ఇది వరుసగా 14వ నెల.  
 



You may be interested

మూడు వారాల కోసం పది సిఫార్సులు

Monday 1st October 2018

వచ్చే మూడు వారాల్లో మంచి రాబడినిచ్చే పది షేర్లను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు 1. ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 151. స్టాప్‌లాస్‌ రూ. 128. కొన్ని నెలలుగా కన్సాలిడేషన్‌లో ఉంది. ఎప్పటికప్పుడు రూ. 125 వద్ద మంచి మద్దతు పొందుతోంది. గత రెండు వారాల్లో లాంగ్‌ లోయర్‌ షాడోలు చార్టుల్లో ఏర్పరచడం ద్వారా దిగువ స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలియజేస్తోంది. ఆర్‌ఎస్‌ఐ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4శాతం డౌన్‌..!

Monday 1st October 2018

ముంబై:- దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేరు సోమవారం 4శాతానికి పైగా నష్టపోయింది. ఈ షేరు నేడు బీఎస్‌ఈలో రూ.1258.2ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 4.28శాతం నష్టపోయి రూ.1204.30 కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నాం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.1258.2) ధరతో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.1218ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

Most from this category