STOCKS

News


ఈ ఏడాది 1.75 లక్షల యూనిట్లు

Thursday 6th December 2018
news_main1544075193.png-22686

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
దేశవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో 1.75 లక్షల త్రిచక్ర వాహనాలు అమ్ముడవుతాయని పియాజియో ఆశాభావంతో ఉంది. కంపెనీ గతేడాది 1.55 లక్షల యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌ దేశంలో మొదటి రెండు స్థానాల్లో పోటీపడుతుందని పియాజియో రీజినల్‌ మేనేజర్‌ బిజు సుకుమారన్‌ బుధవారం తెలిపారు. ఇక్కడి మార్కెట్లో నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేసిన సందర్భంగా వరిష్ట మోటార్స్‌ ప్రొప్రైటర్‌ అభిషేక్‌ తోష్నివాల్‌, వర్దమాన్‌ మోటార్స్‌ సీవోవో సందీప్‌ కోఠారితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘దక్షిణాదిన ఏటా 75,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 32,400 పైగా వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. పుణే సమీపంలోని తయారీ కేంద్రం వార్షిక సామర్థ్యం 3 లక్షల వాహనాలు. హైదరాబాద్‌లో మెట్రో ప్రాజెక్టు రాకతో త్రీవీలర్లకు డిమాండ్‌ పెరిగింది’ అని వివరించారు. 



You may be interested

సాగర్‌ సిమెంట్స్‌ భారీ విస్తరణ

Thursday 6th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్‌ సిమెంట్స్‌ భారీగా విస్తరిస్తోంది. 2021 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 8.25 మిలియన్‌ టన్నులకు చేర్చనుంది. ప్రస్తుతం సంస్థ సామర్థ్యం 5.75 మిలియన్‌ టన్నులు. విస్తరణలో భాగంగా మిలియన్‌ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వద్ద నెలకొల్పనుంది. ఇందుకోసం రూ.150 కోట్లను సద్గురు సిమెంట్‌లో (ఎస్‌సీపీఎల్‌) పెట్టుబడిగా పెట్టనుంది. అలాగే వేస్ట్‌ హీట్‌ రికవరీ పవర్‌ ప్రాజెక్టును రూ.426

రేపట్నుంచి ఫోర్డ్ మెగా సేల్స్‌ కార్యక్రమం

Thursday 6th December 2018

హైదరాబాద్:  ‍ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ డిసెంబర్ 7 నుంచి 9 దాకా 'మిడ్‌నైట్ సర్‌ప్రైజ్'  పేరిట మెగా సేల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 11 కోట్ల విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు సంస్థ తెలిపింది. దీన్ని పురస్కరించుకుని తమ షోరూమ్‌లు ఉదయం 9 గం.ల. నుంచి అర్ధరాత్రి దాకా తెరిచే ఉంటాయని సంస్థ మార్కెటింగ్ ఈడీ వినయ్ రైనా తెలిపారు. ఫోర్డ్ కారు కొనుగోలు చేసే వారికి

Most from this category