STOCKS

News


బ్యాంకింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం

Saturday 27th October 2018
news_main1540609440.png-21508

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ నిబంధనలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై ప్రయోగించిన సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నిబంధనలను సడలించాలని రిజర్వ్ బ్యాంకును కేంద్రం కోరడం లేదని ఆయన వివరించారు. "నిబంధనలన్నింటినీ సడలించేస్తే.. ఏ వ్యవస్థా నిరంతరం ఒంటికాలిపైనే నిలబడలేదు. చర్చ అంతా కూడా మన నియంత్రణ విధానాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మాత్రమే. అత్యుత్తమమైన విధానాలు పాటించాలనే. అంతే తప్ప నిబంధనలను సడలించాలని కాదు" అని రాజీవ్ కుమార్ చెప్పారు. పీసీఏ నిబంధనలను సడలించాలంటూ ఆర్‌బీఐని కేంద్రం కోరిందా అన్న ప్రశ్నపై స్పందించిన కుమార్ ఈ మేరకు సమాధానమిచ్చారు. కఠిన నిబంధనల వల్ల వ్యాపార కార్యకలాపాలను విస్తరించలేని పరిస్థితి ఏర్పడిందని, వీటిని సడలించాలని గత నెల ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలోనే రాజీవ్ కుమార్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. బలహీనంగా ఉన్న బ్యాంకులు మరింత పతనం కాకుండా, మళ్లీ పుంజుకునేలా చూసేందుకు పీసీఏ నిబంధనలను ఉద్దేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11 బ్యాంకులు పీసీఏ పరిధిలో ఉన్నాయి. 



You may be interested

టాప్‌5లో ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌

Saturday 27th October 2018

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ ఏడాది ఆర్జించిన లాభాలన్నింటినీ కోల్పోగా... కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు మాత్రం ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాల పనితీరు విషయంలో సానుకూల పనితీరునే కనబరిచాయి. వ్యాల్యూ రీసెర్చ్‌ పాయింట్స్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... టాప్‌-5లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు కూడా ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది.  పథకం    ఏడాదికి (రాబడుల శాతం) మూడేళ్లు ఐదేళ్లు ఐసీఐసీఐ బ్లూచిప్‌ ఫండ్‌    10.57    13.69  

జియో ట్యారిఫ్‌లు పెరగనట్లే..

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: దేశీ టెలికాం రంగం మరింత మంది కస్టమర్లను చేరుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మొబైల్‌ టారిఫ్‌ల పెంపు కుదరదని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ 40 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్లనే వాడుతున్నారని, వీరిని చేరుకోవాలంటే.. కంపెనీలు టారిఫ్‌లను పెంచకుండానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గిగాబైట్‌ వ్యయం తగ్గించడం, పెంచడం అనేది ఇక్కడ విషయం కాదని.. ఆవిష్కరణలతో ముందుకు కొనసాగే సంస్థలకే మనుగడ ఉంటుందని

Most from this category