STOCKS

News


దేశీ పీసీ మార్కెట్‌ 20% వృద్ధి

Thursday 22nd November 2018
news_main1542863662.png-22288

న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు, సామాన్య వినియోగదారుల సెగ్మెంట్‌లలో మెరుగైన డిమాండ్‌తో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విక్రయాలు ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 27.1 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 20.2 శాతం వృద్ధి చెందాయి. అయితే సీక్వెన్షియల్‌గా పెరిగినప్పటికీ, గతేడాది జూలై-సెప్టెంబర్‌ వ్యవధితో పోలిస్తే మాత్రం అమ్మకాలు సుమారు 10.6 శాతం తగ్గాయని రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఒక నివేదికలో వెల్లడించింది. గతేడాది క్యూ3లో జీఎస్‌టీ విధానం అమలుతో అమ్మకాలు ఒక్కసారిగా వెల్లువెత్తడం ఇందుకు కారణమని పేర్కొంది. ప్రీమియం కంప్యూటర్స్‌ అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. భారత మార్కెట్లో మొత్తం పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ మాత్రం క్షీణించవచ్చని ఐడీసీ తెలిపింది. ఇంటెల్ చిప్ కొరత, దీపావళి అనంతరం మార్కెట్లో మందగమనం తదితర అంశాలు ఇందుకు కారణం కాగలవని ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ (క్లయింట్ డివైజెస్‌) నవ్‌కేందర్‌ సింగ్ తెలిపారు. మధ్య స్థాయి, ప్రీమియం విభాగాల్లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం ద్వారా రాబోయే నెలల్లో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థలు (ఓఈఎం) తమ పోర్ట్‌ఫోలియోలో సమూల మార్పులు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
అగ్రస్థానంలో హెచ్‌పీ..
జులై-సెప్టెంబర్‌లో అమ్మకాలకు సంబంధించి 30.7 శాతం మార్కెట్ వాటాతో హెచ్‌పీ అగ్రస్థానంలో నిల్చింది. డెల్ (22.9%), లెనొవొ (21.3 శాతం), ఏసర్ (12.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కన్జూమర్ పీసీ మార్కెట్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 14.5 లక్షల యూనిట్స్ అమ్మకాలు నమోదు చేసింది. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే ఇది 33.9 శాతం వృద్ధి. గేమింగ్ నోట్‌బుక్స్ వంటి ప్రీమియం డివైజ్‌లకు డిమాండ్‌, కన్జూమర్ ఫైనాన్సింగ్ స్కీముల ఊతం తదితర అంశాలు ఇందుకు దోహదపడినట్లు ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ నిశాంత్ బన్సల్‌ తెలిపారు. పండుగ సీజన్‌, ఆన్‌లైన్ మాధ్యమం మొదలైనవి వినియోగదారులు మరింతగా కొనుగోళ్లు జరిపేందుకు తోడ్పడ్డాయని వివరించారు. మరోవైపు కమర్షియల్ పీసీ మార్కెట్ సీక్వెన్షియల్‌గా 7.5 శాతం వృద్ధితో 12.5 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఒడిషా, రాజస్థాన్‌, అసోం వంటి రాష్ట్రాల్లో విద్యా రంగంలో భారీ ప్రాజెక్టులు ఇందుకు దోహదపడినట్లు బన్సల్ తెలిపారు. You may be interested

ఆర్‌బీఐ బోర్డు నిర్ణయాలు మంచివే: ఉదయ్‌కోటక్‌

Thursday 22nd November 2018

ముంబై: ఆర్‌బీఐ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ స్వాగతించారు. ఆర్థిక రంగానికి ఇవి కచ్చితంగా మేలు చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాల పునరుద్ధరణ సహా పలు కీలక అంశాలపై ఆర్‌బీఐ బోర్డు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ వద్ద మిగుల నిల్వలు ఎంత ఉండాలన్న దానిని నిర్ణయించేందుకు నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయడానికి, బ్యాలన్స్‌

ఉద్యోగుల సంక్షేమంపై కంపెనీల దృష్టి

Thursday 22nd November 2018

ముంబై: ఉత్పాదకతను మరింతగా పెంచుకునే క్రమంలో ఉద్యోగుల ఆరోగ్యంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. వారు ఆర్థికంగాను, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వైజరీ, బ్రోకింగ్‌ సంస్థ విలిస్ టవర్స్ వాట్సన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గడిచిన ఏడాది కాలంలో 80 శాతం సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు హెల్త్ రిస్కులు గుర్తించడం మొదలుకుని వెయిట్ మేనేజ్‌మెంట్, పౌష్టికాహార కల్పన,

Most from this category