STOCKS

News


మరింత సరళంగా ప్రత్యక్షపన్ను చట్టాలు

Thursday 20th December 2018
news_main1545284152.png-23106

న్యూఢిల్లీ: ఆదాయపన్ను చట్టాన్ని మరింత సరళంగా, ప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యేలా తీర్చిదిద్దేందుకు ఒక కొత్త ప్యానెల్‌ ఏర్పాటైంది. అనేక ఉదాహరణలు, నిబంధనలతో క్లిష్టంగా మారిన చట్టంలోని భాగాలపై ప్యానెల్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టనుందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. భారత ఆదాయపన్ను చట్టాన్ని 1961లో రూపొందించారు. ఇప్పటికీ చట్టంలోని పలు అంశాలు సామాన్యులకు కొరుకుడు పడని రీతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి మరింత విపులంగా ఐటీ చట్టాన్ని తీసుకుపోయేందుకు కృషి చేస్తామని ప్యానెల్‌ సభ్యుడు అఖిలేశ్‌ రాజన్‌ తెలిపారు. ‘‘పన్నుచట్టాలు అందరికీ అర్ధం అయ్యేలా ఉండాలి. కానీ చట్టంలోని కొన్ని భాగాల్లోని భాష క్లిష్టంగా ఉంది. కొన్ని చోట్ల ఒక విషయంపై అనేకానేక వివరణలున్నాయి. కేవలం చట్టాన్ని మార్చామంటే మార్చామని కాకుండా ప్రజలకు వీలయినంత స్పష్టంగా చట్టాన్ని సరళీకరించాల్సిన అవసరం ఉంది.’’అని రాజన్‌ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరకు ప్యానెల్‌ తన నివేదిక సమర్పించనుంది. వచ్చే ఏడాది బడ్జెట్లో ప్యానెల్‌ సిఫార్సులు పొందుపరిచే అవకాశాలున్నాయి. ప్యానెల్‌లో రాజన్‌తో పాటు గిరీశ్‌ అహూజా, రాజీవ్‌ మెమానీ, ముకేశ్‌ పటేల్‌, మన్సి కేడియా, జీసీ శ్రీవాస్తవ ఉన్నారు. ఇతర దేశాల్లో చట్టాలను పోల్చిచూసుకుంటూ మన దేశంలో ఆదాయపన్ను చట్టాన్ని ఎలా సరళీకరించాలనే విషయంపై ప్యానెల్‌ పనిచేయనుంది. 



You may be interested

కొత్తగా 20 ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్లు

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) సాంకేతిక సాయం అందించేందుకు అదనంగా మరో 20 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెప్పారు. అధునాత ఉత్పత్తి సాంకేతికత, నైపుణ్య శిక్షణ, వ్యాపార సలహాలకు సంబంధించి ఈ కేంద్రాలు ఎంఎస్‌ఎంఈలకు సాయం చేస్తాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పరుస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 10 ఎంఎస్‌ఎంఈ కేంద్రాలున్నాయి. సమాయనుగత రుణసాయం అందకపోవడం సహా ఈ రంగం

జెట్‌ఎయిర్‌వేస్‌పై డీజీసీఏ డేగకన్ను

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: నిధుల సమస్యతో సతమతమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక పరిస్థితిని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ నిశితంగా పరిశీలించనుంది. ఇకనుంచి ప్రతి పదిహేను రోజులకొకసారి సంస్థ ఆర్థిక స్థితిగతులను డీజీసీఏ పర్యవేక్షిస్తుందని సంబంధిత అధికారులు చెప్పారు. సీఏఆర్‌ (సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్‌)లోని నిబంధనల ఆధారంగా ఈ పరిశీలన జరపుతారు. ఇందులో భాగంగా విమానాల నిర్వహణ, సంస్థ నిర్వహణ తదితర అంశాలను కూడా డీజీసీఏ గమనించనుంది. గత ఆగస్టులో కంపెనీలో డీజీసీఏ

Most from this category