STOCKS

News


లక్ష కోట్ల డాలర్ల అవకాశాలు

Friday 24th August 2018
news_main1535089732.png-19590

న్యూఢిల్లీ: కొత్త తరం 5జీ వైర్‌లెస్ సర్వీసులతో దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి రాగలవని అత్యున్నత స్థాయి కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది ఆఖరు నాటికల్లా స్పెక్ట్రం కేటాయింపు, సంబంధిత విధానం గురించి కేంద్రం తగు ప్రకటన చేయొచ్చని సూచించింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏజే పాల్‌రాజ్ సారథ్యంలోని కమిటీ ఈ మేరకు కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌కి నివేదిక సమర్పించింది. నిర్దిష్ట బ్యాండ్లలో దశలవారీగా 5జీ స్పెక్ట్రంను కేటాయించాలని సూచించిన కమిటీ .. అధిక స్పెక్ట్రం ధరల విషయంలో వ్యత్యాసాలను సరిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. "5జీ సేవలతో 2035 నాటికల్లా మొత్తం మీద 1 లక్ష కోట్ల డాలర్ల మేర ఆర్థిక ప్రయోజనాలు కనిపించగలవు. కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 31 నాటికి స్పెక్ట్రం విధానాన్ని ప్రకటించి, తత్సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేయొచ్చు" అని అభిప్రాయపడింది. 2020 నాటికి వ్యాపారపరమైన సేవలు ప్రారంభం కావొచ్చని పాల్‌రాజ్ చెప్పారు. వచ్చే 5-7 ఏళ్లలో 5జీ మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ 100 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయొచ్చని నివేదిక వివరించింది. 



You may be interested

పీఎన్‌బీ ఉద్యోగులకు 10 కోట్ల షేర్లు

Friday 24th August 2018

న్యూఢిల్లీ: దీర్ఘకాలిక వనరులను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. తమ ఉద్యోగులకు కొత్తగా 10 కోట్ల షేర్లను కేటాయించాలని యోచిస్తోంది. ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ఈఎస్‌పీఎస్‌) కింద వీటిని కేటాయించే ప్రతిపాదనకు సెప్టెంబర్ 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి తీసుకోనుంది. బ్యాంకులో కేంద్రం వాటా 52 శాతానికి తగ్గని విధంగా కొత్తగా 10 కోట్ల షేర్లను

లాజిస్టిక్స్‌ కోసం త్వరలో ప్రత్యేక పోర్టల్

Friday 24th August 2018

న్యూఢిల్లీ: దేశ, విదేశ మార్కెట్లలో వాణిజ్య నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా త్వరలో జాతీయ స్థాయిలో నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఎగుమతి, దిగుమతి.. దేశీయంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను దీని ద్వారా అనుసంధానించనున్నట్లు ఆయన తెలియజేశారు. తద్వారా ఉద్యోగాల కల్పన, వాణిజ్యంలో పోటీతత్వం పెంచేందుకు ఇది ఉపయోగపడగలదని.. భారత్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తోడ్పడగలదని

Most from this category