STOCKS

News


అలా అయితే... పాన్‌ దరఖాస్తులో తండ్రి పేరు అక్కర్లేదు

Wednesday 21st November 2018
news_main1542776064.png-22249

న్యూఢిల్లీ: పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌)కు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి తల్లే సింగిల్‌ పేరెంట్‌ అయితే, సంబంధిత వ్యక్తి పాన్‌ దరఖాస్తులో తండ్రిపేరు అక్కర్లేదు. ఆదాయపు పన్ను నిబంధనలను సవరిస్తూ, ప్రత్యక్ష పన్నల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫి‍కేషన్‌ జారీ చేసింది. సవరణలకు అనుగుణంగా దరఖాస్తులో మార్పూ ఉంటుంది. దరఖాస్తుదారుల తల్లిపేరు మాత్రమే సమర్పించడానికి ఈ తాజా దరఖాస్తు వీలు కల్పిస్తుంది. తాజా నిబంధన డిసెంబర్‌ 5వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం పాన్‌ జారీకి తండ్రి పేరు సమర్పించడం తప్పనిసరి. కొన్ని వర్గాల నుంచి విజ్ఞప్తుల మేరకు తాజా మార్పులు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వార్షికంగా రూ.2.5 లక్షలు ఆపైన ఆర్థిక లావాదేవీలు కలిగినవారు తప్పనిసరిగా పాన్‌ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 



You may be interested

రెండవ త్రైమాసికంలో జీడీపీ డౌన్‌?

Wednesday 21st November 2018

ముంబై: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) తగ్గే అవకాశం ఉందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రేటు దాదాపు 7.2 శాతంగా నమోదయ్యే వీలుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల మందగమనం దీనికి కారణమని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 8.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున సెప్టెంబర్‌

‘జీ’పై విదేశీ దిగ్గజాల కన్ను!?

Wednesday 21st November 2018

సుభాష్‌ చంద్ర... దేశీ మీడియా రంగంలో సుపరిచితమైన పేరు. జీ టెలివిజన్‌ చానెళ్లతో విదేశీ మీడియా సంస్థలకు ధీటుగా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే, హఠాత్తుగా ప్రధాన కంపెనీలో వాటాలను విక్రయించాలని నిర్ణయించడంతో మీడియాలో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. తన వ్యాపారానికి మూల స్తంభంలాంటి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీల్‌) పగ్గాలను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు, టెక్నాలజీ కంపెనీలతో పాటు దేశీయంగా

Most from this category