STOCKS

News


వ్యాపారులందరికీ పాన్‌ తప్పనిసరి!

Thursday 6th December 2018
news_main1544074622.png-22682

న్యూఢిల్లీ: ఇకపై వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌) తీసుకోవాల్సిందే. రోడ్డు పక్కన, మార్కెట్లలో, ఆఖరికి తోపుడు బండ్లపై వ్యాపారం చేసేవారు కూడా ఇక పాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇకపై ఏడాదికి రూ.2.5 లక్షలకు మించి వ్యాపారం చేసే వారంతా పాన్‌ తప్పనిసరిగా తీసుకోవాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిది. వార్షికంగా రూ.2.5 లక్షలంటే... నెలకు దాదాపు రూ.20వేలు. అంటే రోజుకు రూ.700 కంటే కూడా తక్కువే. నిజానికి ఎంత చిన్న వ్యాపారం చేసేవారైనా రోజుకు రూ.700 కన్నా తక్కువ విక్రయించే అవకాశం ఉండదు. అంతకన్నా తక్కువ విక్రయిస్తే... ఆ వ్యాపారంపై బతకటమే కష్టం కనక!!. దీన్ని బట్టి దేశంలోని ప్రతి వ్యాపారీ తప్పనిసరిగా పాన్‌ నెంబరు తీసుకోవాల్సి ఉంటుంది. 
ఇలా వీరంతా పాన్‌ తీసుకోవాలన్న కొత్త నిబంధన  బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది మే 31లోగా వీరంతా పాన్‌ తీసుకోవాల్సిందేనని సీబీడీటీ నిర్దేశించింది. 
ఇవీ... కొత్త పాన్‌ నిబంధనలు
♦ దేశంలో నివసించే వారు (వ్యక్తిగతం కాకుండా సంస్థ పరంగా) రూ.2.50 లక్షలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలో భాగస్వామి అయితే, అప్పటికే ఇటువంటి వారు పాన్‌ తీసుకోకపోయి ఉంటే 2019 మే 31 నాటికి పాన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. 
♦ ఈ సంస్థలతో సంబంధం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఈ నిబంధనలు వర్తించవు. కనీసం రూ.2.5 లక్షలకు పైన లావాదేవీలు నిర్వహించిన సంబంధిత సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌, పార్ట్‌నర్‌, ట్రస్టీ, ఆథర్‌, వ్యవస్థాపకుడు, కర్త, ఈసీవో లేదా ఆఫీసు బేరర్‌ కూడా పాన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 
♦ రెసిడెంట్‌ సంస్థలు (దేశంలో కార్యకలాలు నిర్వహించేవి / ఇక్కడ నమోదైనవి) ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ లేదా స్థూల ఆదాయం రూ.5 లక్షలకు మించకపోయినా పాన్‌ తీసుకోవాల్సి ఉంటుందని నాంజియా అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్‌ సూరజ్‌ నాంజియా తెలిపారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు, పన్ను పరిధిని పెంచుకునేందుకు ఆదాయపన్ను శాఖకు ఇది సాయపడుతుందన్నారు.
పాన్‌ తీసుకుంటే ఏమవుతుంది?
ఇలా చిరు వ్యాపారులు కూడా పాన్‌ తీసుకోవటం వల్ల వారి పేరు, పాన్‌ నెంబరు, బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంటాయి. అప్పటి నుంచి వారు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా జరిపే ప్రతి లావాదేవీ రికార్డుల్లో నమోదవుతుంది. దీంతో వారి ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చి కూడా పన్ను చెల్లించకపోతే ఆదాయపు పన్ను అధికారులకు ఈజీగానే దొరుకుతారు. ఇలా మొత్తం వ్యాపారులంతా పన్ను నెట్‌వర్క్‌ పరిధిలోకి రావటం వల్ల కొంతమందైనా పన్ను ఎగవేస్తున్న వారు దొరికే అవకాశం ఉంటుందన్నది ఆర్థిక రంగ నిపుణుల మాట. You may be interested

రుణాలకు ఇకపై ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటు

Thursday 6th December 2018

ముంబై: రుణాలపై వడ్డీ రేట్ల పరంగా మరింత పారదర్శకత తీసుకొచ్చే చర్యల్ని ఆర్‌బీఐ ప్రకటించింది. గృహ, ఆటో, పర్సనల్‌ లోన్‌, ఎంఎస్‌ఈ సంస్థల రుణాలపై ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లను, అది కూడా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లు అయిన రెపో లేదా ట్రెజరీ ఈల్డ్‌తో అనుసంధానించనుంది. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు అంతర్గత బెంచ్‌ మార్క్‌ రేట్ల విధానాలు ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (పీఎల్‌ఆర్‌), బెంచ్‌

హువావే సీఎఫ్‌ఓ అరెస్ట్‌తో మార్కెట్లకు షాక్‌

Thursday 6th December 2018

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) మెంగ్ వాంగ్‌జోను కెనడా అధికారులు వాంకోవర్‌లో అరెస్టు చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈమెను వాంకోవర్‌లో అరెస్ట్‌ చేసినట్లు కెనడియన్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. 2016 నుంచి యూఎస్‌ చట్టాలను ఉల్లంగిస్తూ పలు షిప్పింగ్స్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫేయ్‌ కుమార్తె

Most from this category