ఆన్లైన్లో ఆక్స్ఫర్డ్ తెలుగు డిక్షనరీ
By Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ప్రపంచ భాషల కార్యక్రమంలోకి తెలుగు కూడా చేరింది. తెలుగు ఆన్లైన్ డిక్షనరీ https://te.oxforddictionaries.com అందుబాటులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ సంస్థ 2015 సెప్టెంబర్లో ‘ఆక్స్ఫర్డ్ గ్లోబల్ లాంగ్వేజెస్’ ప్రాజెక్టును చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 భాషలకు సంబంధించి లెక్సికో గ్రాఫికల్, ఇతర భాషా వనరులను ఆన్లైన్లో అందుబాటులోకి తేవటమే ఈ ప్రాజెక్టు ధ్యేయం. ‘‘ఆక్స్ఫర్డ్ ప్రపంచ భాషల్లోకి తాజాగా తెలుగు చేరడం పట్ల సంతోషంగా ఉన్నాం. తెలుగు భారత్లో నాలుగో అతిపెద్ద భాష’’ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ డైరెక్టర్ జూడీ పియర్సల్ పేర్కొన్నారు.
You may be interested
ఫండ్ మేనేజర్స్ మెచ్చిన షేర్లు ఇవే..
Thursday 15th November 2018అక్టోబరులో సెన్సెక్స్ 5 శాతం నష్టపోయినప్పటికీ.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల జోరు మాత్రం ఈ సమయంలో నిలకడగా కొనసాగింది. మార్కెట్ పతనాన్ని ఒక అవకాశంగా చూసిన ఫండ్ మేనేజర్లు, నాణ్యమైన పలు షేర్లను కొనుగోలుచేశారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులు 22.2 లక్షల కోట్లకు చేరుకోగా.. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 45 శాతం, డెట్ ఫండ్స్ అసెట్స్ 31 శాతం, లిక్విడ్ ఫండ్స్ ఆస్తులు 20 శాతం పెరిగినట్లు
నోట్ల రద్దు తర్వాత 5 లక్షల పీవోఎస్లు: ఆర్బీఎల్ బ్యాంకు
Thursday 15th November 2018హైదరాబాద్: మాస్టర్ కార్డు వ్యూహాత్మక సహకారంతో డీమోనిటైజేషన్ తర్వాత... అంటే 2016 నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా 5 లక్షల పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లను ఏర్పాటు చేసినట్టు ఆర్బీఎల్ బ్యాంకు ప్రకటించింది. ఈ కాలంలో ఈ స్థాయిలో విస్తరణ చేసింది తామేనని పేర్కొంది. అందుబాటులో లేని ప్రాంతాల్లోకీ డిజిటల్ చెల్లింపులను తీసుకువెళ్లడమే ఇరు సంస్థల ధ్యేయంగా తెలిపింది.