STOCKS

News


ప్రైవేటు బ్యాంకులు భారతీయుల చేతుల్లోనే ఉండాలి

Friday 14th December 2018
news_main1544764536.png-22929

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకుల యాజమాన్యం భారతీయుల చేతుల్లోనే ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) అభిప్రాయపడింది. ఈ సంస్థ ‘భారత్‌లో బ్యాంకుల భవిష్యత్తు’ పేరుతో ఢిల్లీలో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించింది. అనంతరం విడుదల చేసిన చర్చా పత్రంలో... ‘‘ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం విషయంలో నియంత్రణపరమైన కార్యాచరణను ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సమీక్షించాల్సిన అవసరం ఉంది. మనలో ఎవరూ కూడా దేశీయ బ్యాంకులు విదేశీ సంస్థల చేతుల్లో ఉండాలని కోరుకోరు’’ అని పేర్కొంది. ప్రమోటర్లకు సంబంధించిన గరిష్ట వాటాల పరిమితిని కూడా పునఃపరిశీలించాలని సూచించింది. 



You may be interested

రాఫెల్‌ డీల్‌ పిటిషన్ల కొట్టివేత: అడాగ్‌ షేర్ల ర్యాలీ

Friday 14th December 2018

వివాదస్పద రాఫెల్ ఒప్పందంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో శుక్రవారం అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. దేశ రక్షణార్థం 2015 ఏప్రిల్‌  ఫ్రాన్స్‌ సంస్థ రాఫెల్‌ నుంచి నుంచి 36 యుద్ధ విమానాలను రూ.58వేల కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోది ప్రకటించారు. అందులో భాగంగా రాఫెల్‌ తమ భారత భాగస్వామిగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంచుకుంది. దివాలా తీసిన

ప్రీమియం వసూలుపై పాలసీదారులకు ఎస్‌ఎంఎస్‌

Friday 14th December 2018

న్యూఢిల్లీ: బీమా పాలసీలకు సంబంధించి ప్రీమియం అందుకున్న వెంటనే ఆ విషయాన్ని పాలసీదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయాలంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ.. ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

Most from this category