STOCKS

News


ఆన్‌లైన్‌ రిటైల్‌లో 4 రెట్లు వృద్ధి..!

Thursday 4th October 2018
news_main1538626542.png-20835

న్యూఢిల్లీ: సంప్రదాయ రిటైల్‌ నుంచి సామాన్యులు ఆన్‌లైన్‌ బాటా పడుతున్న నేపథ్యంలో ఈ రంగం అంచనాలకు మించి వేగంగా అభివృద్ధి చెందనుందని వెల్లడైంది. చౌక స్మార్ట్‌ఫోన్లు, అందుబాటులో ఉన్న హైస్పీడ్‌ డేటాలు ఈ-కామర్స్‌ రంగాన్ని నూతన శిఖరాలకు చేరుస్తున్నాయని విశ్లేషించిన ప్రముఖ రిలైల్‌ కన్సల్టెంట్ అనరాక్.. 2022 నాటికి ఆన్‌లైన్‌ రిటైల్‌ నాలుగు రెట్లు వృద్ధి చెంది రూ.5,36,440 కోట్ల మార్కెట్‌గా అవతరించనుందని అంచనావేసింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌ రూ.1,30,749 కోట్లుగా ఉన్నట్లు తన నివేదికలో తెలిపింది. ‘పట్టణీకరణ, డిజిటైజేషన్ వేగంగా వృద్ధి చెందుతుండడం.. పెరుగుతున్న సామాన్యుల తలసరి ఆదాయం, మారుతున్న జీవినవిధానం వంటి అంశాల ఆధారంగా 2020 నాటికి మొత్తం రిటైల్‌ మార్కెట్‌ విలువ 95,51,750 కోట్లు (1.3 ట్రిలియన్‌)గా అంచనా. ఇందులో ఆన్‌లైన్‌ రిటైల్‌ వాటా రూ.5,36,440 కోట్లు (73 బిలియన్‌ డాలర్లు) ఉండనుందని అంచనావేస్తున్నాం. అని అధ్యనం నిర్వహించిన అనరాక్ సీఈఓ అనూజ్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. క్యాష్‌ ఆన్‌ డెలివరీ, తయారీదారు వారెంటీ, భారీ డిస్కౌంట్లు వంటి అంశాలతో ఆన్‌లైన్‌ రిటైల్‌ మరింత జోరందుకుంటుందని అన్నారు.You may be interested

జేబీ కెమికల్స్‌ షేర్ల బైబ్యాక్‌ 10 నుంచి

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 24న ముగిసే ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ ‍ద్వారా 33.33 లక్షల షేర్లను కొనుగోలు చేస్తామని జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.390 ధర చొప్పున ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.130 కోట్లని వివరించింది. షేర్ల బైబ్యాక్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో జేబీ

హాథ్‌వేపై రిలయన్స్ కన్ను

Thursday 4th October 2018

ముంబై: గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ క్రమంలో.. ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్‌ ఆపరేటర్‌ హాథ్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీల్‌ పూర్తిగా కుదురుతుందా లేదా

Most from this category