STOCKS

News


విధానాలను క్రమబద్ధీకరించాలి

Friday 14th December 2018
news_main1544764355.png-22927

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా విధానాలను క్రమబద్ధీకరించాలని, అట్టడుగున ఉండేవారికి కూడా సేవలు అందేలా చూడటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' జాబితాలో దేశ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు చిన్న వ్యాపార సంస్థలు, సామాన్య ప్రజానీకం జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన చెప్పారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై గురువారం జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్మాణాలకు అనుమతులు, కాంట్రాక్టుల అమలు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌, రుణ సదుపాయాలు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు వివరించింది. వ్యాపార సంస్కరణల అమలు తీరుతెన్నులు, ఎదురవుతున్న అడ్డంకులు, వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. కేంద్ర మంత్రులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజల్, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు మొదలైన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు 'డూయింగ్ బిజినెస్' పేరిట రూపొందించే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో గడిచిన నాలుగేళ్లలో భారత్‌ 142వ స్థానం నుంచి 77వ స్థానానికి ఎగబాకింది. 



You may be interested

ప్రీమియం వసూలుపై పాలసీదారులకు ఎస్‌ఎంఎస్‌

Friday 14th December 2018

న్యూఢిల్లీ: బీమా పాలసీలకు సంబంధించి ప్రీమియం అందుకున్న వెంటనే ఆ విషయాన్ని పాలసీదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయాలంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ.. ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

అదానీ చేతికి ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌

Friday 14th December 2018

 న్యూఢిల్లీ: ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ (ఏడీటీఎల్‌) కంపెనీని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేసింది. ఏడీటీఎల్‌ను తమ పూర్తి అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ రూ.400 కోట్లకు కొనుగోలు చేసిందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.290.37 ​​ప్రీమియమ్‌తో మొత్తం 1.33 కోట్ల షేర్లను కొనుగోలు చేశామని పేర్కొంది. ఆల్ఫా డిజైన్‌ కంపెనీ రక్షణ సంబంధిత పరికరాల రూపకల్పన,

Most from this category