STOCKS

News


చిన్న సంస్థలకు పాత పీసీల భారం

Friday 23rd November 2018
news_main1542949337.png-22340

న్యూఢిల్లీ: చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు (ఎస్‌ఎంబీ) నాలుగేళ్ల పైబడిన పర్సనల్‌ కంప్యూటర్స్‌ భారంగా మారుతున్నాయి. వీటి మెయింటెనెన్స్‌కి ఒక్కో దానిపై దాదాపు రూ. 93,500 దాకా ఖర్చవుతోంది. ఈ డబ్బుతో కొత్తగా మరో మూడు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కంప్యూటర్లు కొనుక్కోవచ్చు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాతబడిన డివైజ్‌ల వల్ల ఉత్పాదకత నష్టం, పొంచి ఉన్న సెక్యూరిటీ రిస్కులు మొదలైన వాటి కారణంగా ఎస్‌ఎంబీలపై నేరుగా ఎంత మేర వ్యయాలపరమైన భారం పడుతోందన్న అంశంపై టెక్‌ఐల్‌ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇండొనేషియా, జపాన్‌, దక్షిణ కొరియాకు చెందిన 2,156 ఎస్‌ఎంబీలు పాల్గొన్నాయి. వ్యయాల భారం, సెక్యురిటీపరమైన రిస్కులు ఉన్నప్పటికీ 49 శాతం పెద్ద సంస్థలు, 31 శాతం చిన్న సంస్థలు ఇంకా పాత పీసీలనే ఉపయోగిస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరోవైపు, కొత్త పీసీలు కొనుగోలు చేసిన వాటిల్లో సుమారు 66 శాతం సంస్థలు తమ పనితీరు మెరుగుపడిందని చెప్పగా, 63 శాతం సంస్థలు కొత్త పీసీల్లో తమ డేటాను సురక్షితంగా ఉంచుకోగలుగుతున్నామని పేర్కొన్నాయి. భారత్‌లో 5.1 కోట్ల పైచిలుకు లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. వీటిలో 11.4 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. 



You may be interested

బ్యాంక్‌ రుణ వృద్ధి 15 శాతం

Friday 23rd November 2018

ముంబై: బ్యాంకింగ్‌ రంగం రుణ వృద్ధి 2018 నవంబర్‌ 9వ తేదీతో ముగిసిన పక్షం​రోజుల్లో 14.88 శాతం పెరిగింది. విలువ రూపంలో ఇది రూ.91.11 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రుణాల పరిమాణం 79.31 లక్షల కోట్లు. ఇక ఇదే సమీక్షా కాలానికి సంబంధించి డిపాజిట్లను చూస్తే, 9.13 శాతం వృద్ధితో 108.35 లక్షల కోట్ల నుంచి 118.25 లక్షల కోట్లకు పెరిగింది. ఈ మేరకు రిజర్వ్‌

రవాణా వ్యయాలు తగ్గింపుపై దృష్టి: ప్రభు

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: సరుకులు వేగంగా రవాణా అయ్యేందుకు, రవాణా లావాదేవీల వ్యయాలను తగ్గించేందుకు నూతన సమగ్ర రవాణా విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. రైలు, రోడ్డు, నౌక, వాయు రవాణా వ్యవస్థలను అనుసంధానించే విధంగా ఈ విధానం ఉంటుందన్నారు. రవాణాను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఓ పోర్టల్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టు ఢిల్లీలో జరిగిన సిల్ట్‌ ఎక్స్‌పో 2019 సందర్భంగా మంత్రి ప్రకటించారు. దేశంలో సరుకుల రవాణా

Most from this category