News


ఈశాన్య రాష్ట్రాలకు రూ.58,166 కోట్లు

Saturday 2nd February 2019
news_main1549101464.png-23971

  • 21 శాతం పెరిగిన బడ్జెట్‌ కేటాయింపులు

న్యూఢిల్లీ: 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలకు 21 శాతం అదనంగా కేటాయింపులు జరిపింది. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ఈసారి ఈశాన్య రాష్ట్రాలకు రూ.58,166 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఇది 21 శాతం అధికమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మౌలికవసతుల అభివృద్ధితో ఈశాన్య రాష్ట్రాలు గణనీయంగా లబ్ధి పొందాయని వ్యాఖ్యానించారు. బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని మెరుగుపరుస్తామనీ, సరుకు రవాణా నౌకల్ని ఈశాన్య రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అరుణాచల్‌ప్రదేశ్‌కు తొలిసారి విమానయాన వసతి, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలకు మొట్టమొదటిసారిగా రైల్వే సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బోగీబిల్‌ వంతెన వంటి కీలక ప్రాజెక్టులను ఎన్డీయే ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు. సిక్కింలోని పక్‌యాంగ్‌లో విమానాశ్రయం ఏర్పాటుతో దేశంలోని ఎయిర్‌పోర్టుల సంఖ్య 100కు చేరుకుందని గోయల్‌ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల మండలికి రూ.580 కోట్లు, ఈశాన్య రాష్ట్రాలు-సిక్కింలకు కేంద్ర నిధుల కింద రూ.931 కోట్లు, సబ్సిడీ కింద రూ.674 కోట్లు, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల్లోని కంపెనీలకు జీఎస్టీ రీఫండ్‌ కోసం మరో రూ.1,700 కోట్లు కేటాయించామని వెల్లడించారు.



You may be interested

స్ర్తీ, శిశు సంక్షేమానికి 20శాతం అధిక నిధులు

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 29164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను

రైల్వేకు 1.58 లక్షల కోట్ల మూలధన వ్యయం

Saturday 2nd February 2019

చరిత్రలో ఇదే అత్యధికం బడ్జెట్‌లో 64 వేల కోట్ల కేటాయింపులు కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లన్నీ ఎత్తేశాం: గోయల్‌ న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించినట్లుగానే రైల్వే చార్జీల పెంపు లేకుండానే తాజా బడ్జెట్‌ వచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత మూలధన ‍వ్యయాన్ని ఈ బడ్జెట్‌లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని

Most from this category