STOCKS

News


నిల్చిన రూ. 2వేల నోట్ల ముద్రణ

Saturday 5th January 2019
news_main1546684864.png-23428

న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ అనంతరం ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్ల ముద్రణను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది. అవసరాలకు అనుగుణంగానే నోట్ల ముద్రణ ఉంటుందని, ప్రస్తుతానికి తగినంత స్థాయిలో రూ.2,000 నోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు. "ప్రస్తుతం వ్యవస్థలో రూ.2,000 నోట్లు అవసరమైన దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం నోట్ల విలువలో ఇవి 35 శాతంగా ఉంటాయి. రూ. 2,000 నోట్ల ముద్రణకు సంబంధించి ఇటీవల ప్రత్యేకంగా నిర్ణయమేమీ తీసుకోలేదు" అని మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు. రూ.2,000 నోట్ల ముద్రణ నిల్చిపోయిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో గర్గ్ సూచనప్రాయ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



You may be interested

అనిల్ అంబానీని జైలుకు పంపండి!!

Saturday 5th January 2019

విదేశాలకు వెళ్లకుండా ఆదేశాలివ్వండి మా బాకీల చెల్లింపులో మళ్లీ మళ్లీ డిఫాల్టవుతున్నారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎరిక్‌సన్‌ న్యూఢిల్లీ: దాదాపు 550 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడంలో పలుమార్లు విఫలమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) చీఫ్ అనిల్ అంబానీపై స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ బాకీలు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న ఆయన్ను కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుకు పంపాలని, బాకీలు చెల్లించేదాకా దేశం విడిచి వెళ్లకుండా

రూపాయి... తీవ్ర ఒడిదుడుకులు!

Saturday 5th January 2019

 48 పైసలు లాభంతో 69.72కు రికవరీ ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 48 పైసలు బలపడి 69.72 వద్ద ముగిసింది. బుధ, గురు వారాల్లో రూపాయి విలువ 77 పైసలు బలహీనపడి 69.43 నుంచి 70.20కి పడిపోయింది. శుక్రవారం మళ్లీ 48 పైసలు రికవరీతో 70.20 నుంచి 69.72కు చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ,  ఆరు

Most from this category