STOCKS

News


అక్రమార్కులకు వ్యతిరేకంగానే నోట్లరద్దు

Saturday 1st December 2018
news_main1543643676.png-22544

న్యూఢిల్లీ: నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) నిర్ణయం అవినీతిపై పోరాటంలో భాగంగా తీసుకున్నదే కానీ, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం చెప్పినట్టు ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా కాదని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ‘మోదీ- జైట్లీ ఆర్థిక విధానంతో సవాళ్లు’ పేరిట సుబ్రమణ్యం తాజాగా రాసిన పుస్తకంలో డీమోనిటైజేషన్‌ను దారుణమైన నిర్ణయంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్‌కుమార్‌ దీనిపై మాట్లాడారు. ‘‘నేను చూసిన ఓ వార్తలో డీమోనిటైజేషన్‌ ఉన్నత వర్గం వారికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య అని సుబ్రమణ్యం అన్నట్టు చూశాను. ఆయన ఈ పదం ఎందుకు ఉపయోగించారో నాకు తెలియదు. కానీ, నోట్ల రద్దు అన్నది అక్రమంగా సంపదను పోగేసుకున్న వారికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య మాత్రమే. నా మిత్రుడు అరవింద్‌ సుబ్రమణ్యం వీరిని దేశంలో ఉన్నత స్థాయి వారిగా పోల్చరని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నత వర్గం వారు నిజాయితీ కలిగినవారు, కష్టపడి పనిచేసేవారు, చట్టానికి కట్టుబడి ఉండేవారని నా భావన’’ అని రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. అరవింద్‌ సుబ్రమణ్యం 2014 అక్టోబర్‌ నుంచి 2018 జూన్‌ వరకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన విషయం గమనార్హం. కాగా, దేశ ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని డిజిటైజ్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఆధునిక టెక్నాలజీలను అమలు చేయాలని, వారికంటూ స్వీయ నియంత్రణకూడా అవసరమేనని చెప్పారాయన. 



You may be interested

ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరు మారుతోంది

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ పేరు మారనుంది. తన పేరును ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌గా మార్చుకోవడానికి వాటాదారుల ఆమోదాన్ని ఈ బ్యాంక్‌ కోరనుంది. ఈ పేరు మార్పు ప్రతిపాదనకు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటాదారులు డిసెంబరు 4 నుంచి జనవరి 2 మధ్య ఓటేయవచ్చు.  క్యాపిటల్‌ ఫస్ట్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ హోమ్‌ ఫైనాన్స్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ సెక్యూరిటీస్‌ సంస్థలు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కానుండటంతో బ్యాంకు ఈ పేరు మార్పు ప్రతిపాదనను చేసింది. ఈ

ఫుడ్‌ ప్రాసెస్‌ రంగానికి ఎన్‌బీఎఫ్‌సీ

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: ఆహార శుద్ధి రంగంలో కంపెనీలకు రుణ సాయం అందించేందుకు గాను రూ.2,000 కోట్ల నిధితో ఓ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని (ఎన్‌బీఎఫ్‌సీ) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఇది భాగమని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తెలిపారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించానని, ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌

Most from this category