STOCKS

News


కాలుష్య కారక జెన్‌సెట్లు వద్దు

Wednesday 28th November 2018
news_main1543390033.png-22438

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగంలో సంస్కరణల అవసరాన్ని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ నొక్కి చెప్పారు. డీజిల్‌, కిరోసిన్‌ తదితర ఇంధన ఆధారిత జెన్‌సెట్ల (విద్యుత్‌ జెనరేటర్లు) వినియోగాన్ని నిషేధించాలని కోరారు. కోర్టు ఆదేశించడానికి ముందే ప్రభుత్వం ఈ పనిచేయాలన్నారు. 25 ఏళ్ల కాలం దాటిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను తొలగించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే, నచ్చిన కంపెనీ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాలని (ఓపెన్‌ మార్కెట్‌), వాణిజ్య బొగ్గు వెలికితీత, పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ‘‘కాలుష్యానికి కారణమవుతున్నందున పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌, పెట్‌కోక్‌, ఫర్నేస్‌ ఆయిల్‌ను విద్యుత్‌ జెన్‌సెట్లలో వాడటాన్ని నిషేధించాలి. మనకు నచ్చినా.. నచ్చకున్నా ప్రభుత్వం ఈ పనిచేయకపోతే, ఆరు నెలల్లో కోర్టులు ఈ పనిచేస్తాయి’’ అని 21 ఇండియా పవర్‌ ఫోరమ్‌లో భాగంగా అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. జెన్‌సెట్లను ప్రభుత్వం నిషేధిస్తే 24 గంటల పాటు విద్యుత్‌ సదుపాయం అందేలా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లు ప్రకారం... టెలికం రంగంలో పోర్టబులిటీ మాదిరే విద్యుత్‌ రంగంలోనూ వినియోగదారుడు సర్వీస్‌ ప్రొవైడర్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది.
పాత ప్లాంట్లను మూసేయాలి 
‘‘25 ఏళ్లు దాటిన విద్యుత్‌ ప్లాంట్లను దశలవారీగా మూసేయాలి. ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌, మరికొందరికి ఇది నచ్చకపోవచ్చు. కానీ ఇది తప్పనిసరి’’ అని అమితాబ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు ఉత్పత్తి కోసం గాను ప్రైవేటు రంగాన్ని అనుమతించాలన్నారు. బొగ్గు గనులను జాతీయీకరణ చేయడం సరైన చర్య కాదన్నారు. బొగ్గు కొరత నేపథ్యంలో వాణిజ్య మైనింగ్‌కు కేంద్ర కేబినెట్‌ గతంలోనే ఆమోదం తెలిపిన విషయం గమనార్హం. ఉదయ్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌ మంచి పనితీరు చూపించగా, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌, తమిళనాడు, జార్ఖండ్‌, మేఘాలయ పనితీరు బాగా లేదని చెప్పారు. ‘‘బ్యాటరీ, స్టోరేజీపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రస్తుతం కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఖరీదు 276 డాలర్లు అవుతోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఇది 70 డాలర్లకు దిగిరానుంది. దాంతో ఎలక్ట్రిక్‌ కారు ఖరీదు పెట్రోల్‌ కార్ల స్థాయిలోనే ఉంటుంది’’ అని అమితాబ్‌ కాంత్‌ వివరించారు. You may be interested

బలమైన సంస్థగానే ఆర్‌బీఐ

Wednesday 28th November 2018

ముంబై: ఆర్‌బీఐ బలమైన సంస్థగానే కొనసాగుతోందని, ప్రభుత్వంతో ఇటీవల ఏర్పడిన విభేదాలు ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని సవాలు చేసేవి కావని సెబీ మాజీ చైర్మన్‌ దామోదరన్‌ చెప్పారు. నిర్వహణ పరమైన స్వతంత్రతను ఆర్‌బీఐ అనుభవిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య ఎన్నో సందర్భాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఆర్‌బీఐకి ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఇప్పుడు కూడా ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని అడ్డుకుంటున్నారని చెప్పడం తప్పే అవుతుంది’’ అని సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం

డెటెల్‌ నుంచి అత్యంత చౌక ఎల్‌సీడీ టీవీ

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత చౌకగా ఫీచర్‌ ఫోన్లు తయారు చేసే కంపెనీగా పేరున్న డెటెల్‌ తాజాగా చౌకైన ఎల్‌సీడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. 19 అంగుళాల డీ1 ఎల్‌సీడీ టీవీని రూ.3,999 కే అందిస్తున్నామని డెటెల్‌ మొబైల్‌ అండ్‌ యాక్సెసరీస్‌ తెలిపింది. ప్రపంచంలో ఇదే అత్యంత చౌక టీవీ అని ఎస్‌జీ కార్పొరేట్‌ మొబిలిటి (డెటెల్‌ కంపెనీకి ఇది మాతృసంస్థ) ఎమ్‌డీ యోగేశ్‌ భాటియా చెప్పారు. గత ఏడాది ఆగస్టులో

Most from this category