STOCKS

News


ఫిబ్రవరిలో సేవలు బాగున్నాయ్‌: నికాయ్‌

Wednesday 6th March 2019
news_main1551852467.png-24451

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ప్రకారం- సూచీ ఫిబ్రవరిలో  52.5గా నమోదయ్యింది. జనవరిలో ఈ సూచీ 52.3గా ఉంది. కొత్త ఆర్డర్లు బాగుండడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం సూచీ తాజా క్రియాశీలతకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే నికాయ్‌ సూచీ విశ్లేషణను చూస్తే,... 50 పైన పాయింట్లు వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువన క్షీణ ధోరణిగా పరిగణిస్తారు. దీని ప్రకారం- తొమ్మిది నెలల నుంచీ సేవల రంగం వృద్ధి తీరునే కనబరుస్తోంది. 

సేవలు, తయారీ రెండూ సానుకూలమే...
కాగా తయారీ, సేవలకు సంబంధిత నికాయ్‌ ఇండియా కాంపోజిట్ ఇండెక్స్‌ప ప్రకారం...జనవరిలో సూచీ 53.6గా నమోదయ్యింది. అయితే ఫిబ్రవరిలో ఈ సూచీ 53.8గా నమోదయ్యింది. దేశంలో ప్రైవేటు రంగం క్రియాశీలత బాగుండడం దీనికి ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.



You may be interested

డీబీఎస్‌ టెక్నాలజీ అభివృద్ధి

Wednesday 6th March 2019

– చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్‌లకు సేవలు ఇక్కడి నుంచే – త్వరలోనే రూ.260 కోట్లతో 2 లక్షల చ.అ.ల్లో కొత్త క్యాంపస్‌ – ఏడాదిలో కొత్తగా వెయ్యి మంది ఇంజనీర్ల నియామకం – 12–18 నెలల్లో దేశంలో వెయ్యి బ్రాంచీల ఏర్పాటు లక్ష్యం – డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా సీఈఓ సురోజిత్‌ షోమీ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- సింగపూర్‌కు చెందిన డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌ (డీబీఎస్‌) గ్రూప్‌ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్‌ కేంద్రంగానే జరుగుతుంది.

జెనీవా ఆటోషోలో ఎలక్ట్రిక్‌ కార్ల సందడి

Wednesday 6th March 2019

ఎలక్ట్రిక్ హైపర్‌ కార్ బటిస్టా  జెనీవా: ఇక్కడ జరుగుతున్న 89వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో భారత కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. మహీంద్రా గ్రూప్‌ తన ఎలక్ట్రిక్ హైపర్‌ కార్ బటిస్టాను ఆటోషోలో మంగళవారం ఆవిష్కరించింది. కేవలం రెండు సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈకారు గరిష్టంగా 350 కి.మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఫార్మలా రేస్‌ వన్‌ కారు కంటే వేగమైన ఈకారు ఉత్పత్తి

Most from this category