STOCKS

News


ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7% వృద్ధి

Tuesday 23rd October 2018
news_main1540270480.png-21385

న్యూఢిల్లీ: దేశీ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం వృద్ధి నమోదయినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ మూడవ వారం నాటికి మొత్తం వసూళ్లు రూ.4.89 లక్షల కోట్లగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ స్థాయి వృద్ధి రేటును సాధించినట్లు సీబీడీటీ అధికారి ఒకరు సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 11.5 లక్షల కోట్లుగా ఉండాలని లక్ష్యంగా నిర్థేశించుకున్న కేంద్ర ప్రభుత్వానికి... ఈ లక్ష్యంలో ఇప్పటివరకు 42 శాతం వసూళ్లు సమకూరినట్లయింది. ఈ ఏడాది అక్టోబర్‌ 21 నాటికి 5.8 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలు కాగా, గతేడాది ఇదే సమయానికి అందిన 3.6 కోట్ల రిటర్నులతో పోలిస్తే ఈ సారి ఏకంగా 61 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో రిఫండ్స్‌ సైతం 62 శాతం పెరిగాయి. గతేడాది 1.22 కోట్లు (రూ.83,000 కోట్లు) రిఫండ్స్‌ జరుగగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 కోట్లు (రూ.1.09 కోట్లు) రిఫండ్స్‌ నమోదయ్యాయి. మరోవైపు పన్ను చెల్లింపుదారుల సంఖ్యను 1.25 శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐటీ శాఖ 1.85 కోట్ల మందికి ఈ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు పంపించినట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 6.26 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులున్న విషయం తెలిసిందే.



You may be interested

టాప్‌10లో ఏడు ‘మారుతీ’ కార్లు

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. పీవీ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతున్న ఈ సంస్థ.. సెప్టెంబరు అమ్మకాల్లో మరో రికార్డును సొంతం చేసుకుంది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. గత నెల పీవీ విక్రయాల టాప్‌ 10 జాబితాలో ఏకంగా 7 వాహనాలు ఈ కంపెనీకి చెందినవే ఉన్నట్లు

సీమాంతర దివాలా కేసులకు 'ఐరాస' తరహా చట్టాలు

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: సీమాంతర దివాలా కేసుల పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితిలో భాగమైన యూఎన్‌సిఐటీఆర్‌ఏఎల్‌ తరహా చట్టాలను అమల్లోకి తేవచ్చని కేంద్రానికి అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా అభివృద్ధి చెందిన దేశాల ప్రమాణాలకు తగ్గ స్థాయిలో దేశీ దివాలా చట్టాలను మెరుగుపరచుకోవచ్చని పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ సారథ్యంలోని దివాలా చట్ట కమిటీ (ఐఎల్‌సీ) సోమవారం ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి

Most from this category