STOCKS

News


అప్పటినుంచే ఆర్‌బీఐపై కేంద్రం పెత్తనం!

Tuesday 6th November 2018
news_main1541481849.png-21749

న్యూఢిల్లీ: కేంద్రం-రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మధ్య ఇటీవలి ఘర్షణాత్మక వైఖరి తాజాది కాదనీ... మొదటి నుంచీ ఆర్‌బీఐపై కేంద్రం పెత్తనం కొనసాగిందని పేరుతెలపడానికి ఇష్టపడని ఒక ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కాలం నుంచీ ఇలాంటి ధోరణి ఉందని ఆయన  విశ్లేషించారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని కేంద్రం కాలరాస్తోందంటూ తాజాగా నిరసనలను ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వానికి తాజా విశ్లేషణలకు కొంత ఊరటకలిగించేవే. ఉన్నత స్థాయి అధికారి కథనం ప్రకారం- కేంద్రం బ్యాంకులు స్వయం ప్రతిపత్తి ఉండాలని నాటి ప్రధానమంత్రి నెహ్రూ పేర్కొన్నారు. అయితే అది కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. ఒక ప్రతిపాదనకు సంబంధించి తన ఆర్థికమంత్రి టీటీ కృష్ణమాచారివైపు తొలి ప్రధాని నిలబడ్డంతో, అప్పటి ఆర్‌బీఐ నాల్గవ గవర్నర్‌ బెనగల్‌ రామ రావ్‌ 1957లో తన పదవికి రాజీనామా చేశారు. అటు తర్వాత కాలాల్లో గవర్నర్లుగా వచ్చిన ఎన్‌సీ సేన్‌గుప్తా, కేఆర్‌ పురి, దువ్వూరి సుబ్బారావుల వంటివారూ ప్రభుత్వ విధానాలతో పొసగని పరిస్థితులను ఎదుర్కొన్నారని ఉన్నతాధికారి పేర్కొన్నారు. 



You may be interested

హైదరాబాద్‌ కుర్రాడి ‘ఆసీ టికెట్‌’

Tuesday 6th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత పాశం భరత్‌రెడ్డికి చక్కగా సరిపోతుంది. సొంత గడ్డపై రెండు కంపెనీలు ఏర్పాటు చేసి... విజయవంతంగా నడిపిస్తున్న భరత్‌రెడ్డి... టీ-హబ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆస్ట్రేలియాలోనూ అడుగుపెట్టాడు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ క్వీన్స్‌ల్యాండ్‌లో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌లో చేరి... అక్కడా వ్యాపారావకాశాలు వెదికాడు. ఆస్ట్రేలియాలో వ్యవస్థీకృతంగా స్పోర్ట్‌, ఈవెంట్స్‌కు ముందుగా టికెట్లు బుక్‌ చేసుకునే పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ సౌకర్యం

తెలుగు రాష్ట్రాల్లో మరో 30 నెఫ్రోప్లస్‌ కేంద్రాలు

Tuesday 6th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని అతిపెద్ద డయాలసిస్‌ కేర్‌ నెట్‌వర్క్‌ నెఫ్రోప్లస్‌... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరణ చేపట్టింది. వచ్చే ఏడాది కాలంలో రూ.75 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ కొత్తగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 40 సెంటర్లున్నాయి. ఫిబ్రవరి నాటికి ఏపీలో కొత్తగా 3 సెంటర్లను ప్రారంభించనున్నట్లు నెఫ్రోప్లస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ విక్రమ్‌ ఉప్పాల ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.

Most from this category