STOCKS

News


వ్యవసాయోత్పత్తికి కేంద్ర విధానాల ఊతం: జైట్లీ

Wednesday 5th December 2018
news_main1543984079.png-22634

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలనే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. తమ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక​అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. ‘‘ప్రస్తుతం చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చే రెండు దశాబ్దాల్లో నగరాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయొ’’ అని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ రంగాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలు, దేశ రాజధానిలో రైతుల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 



You may be interested

ద్రవ్యోల్బణం డేటాను ఆధునీకరించాలి

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం గణాంకాల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సత్వరమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు రవీంద్ర ధోలకియా అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ మూడు రోజుల పాలసీ భేటీ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ద్రవ్యోల్బణం డేటాపై ధోలకియా ప్రశ్నలు లేవనెత్తారు. ద్రవ్యోల్బణం లెక్కింపునకు సరైన విధానం లేకుండా... ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధిలోనే ఉంచాలన్న కార్యాచరణను ఆర్‌బీఐ అనుసరించడాన్ని ప్రశ్నించారు. ఫిక్స్‌డ్‌ బేస్‌ వెయిట్‌ ఇండెక్స్‌

ఆర్‌బీఐ నుంచి వ్యవస్థలోకి రూ.10,000 కోట్లు

Wednesday 5th December 2018

ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా ఈ నెల 6న వ్యవస్థలోకి రూ.10,000 కోట్ల నిధుల్ని తీసుకొచ్చి, లభ్యతను పెంచనున్నట్లు రిజర్వు బ్యాంకు తెలియజేసింది. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంవో) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత మార్కెట్లో ఏర్పడిన లిక్విడిటీ కొరతను తీర్చేందుకు ఆర్‌బీఐ గత నెల నుంచి ఓఎంవో ద్వారా వ్యవస్థలోకి నిధుల్ని పంపిస్తూ... లభ్యతను పెంచే ప్రయత్నాలు చేస్తోంది.

Most from this category