STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీలకు సెక్యూరిటైజేషన్ దన్ను

Tuesday 16th April 2019
news_main1555393099.png-25156

- 2018-19లో రూ.26,200 కోట్ల సమీకరణ
- ఇక్రా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: నిధుల లభ్యత కష్టంగా మారినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), సూక్ష్మ రణాల సంస్థలు (ఎంఎఫ్‌ఐ) రుణాల పోర్ట్‌ఫోలియోను విక్రయించడం ద్వారా (సెక్యూరిటైజేషన్‌) దాదాపు రూ. 26,200 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఇది 170 శాతం అధికం. 2017-18లో సెక్యూరిటైజేషన్ ద్వారా ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐలు రూ. 9,700 కోట్లు సమీకరించాయి. రేటింగ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్‌అ౾ండ్ఎఫ్‌ఎస్‌) పలు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన దరిమిలా గత ఆర్థిక సంవత్సరం ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణాల సంస్థలకు నిధులు లభ్యత కష్టసాధ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అవి ఫండ్స్‌ సమీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రధానంగా సెక్యూరిటైజేషన్‌పై ఆధారపడినట్లు ఇక్రా పేర్కొంది. 
"2018 ఆర్థిక సంవత్సరంలో, 2019 ప్రథమార్ధంలో మొత్తం నిధుల సమీకరణలో సెక్యూరిటైజేషన్ వాటా 18-20 శాతమే ఉంది. కానీ మూడో త్రైమాసికంలో ఇది 37 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 50 శాతానికి పెరిగింది" అని ఇక్రా గ్రూప్ హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్స్ విభాగం) విభోర్ మిట్టల్ తెలిపారు. 2017-18లో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులు సమీకరించిన సంస్థల సంఖ్య 24గా ఉండగా.. 2018-19లో 43కి చేరిందని పేర్కొన్నారు. వీటిలో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సంస్థలు 14 ఉన్నాయని, ఇది స్వాగతించతగ్గ పరిణామం అని తెలిపారు. అయితే, నిధుల లభ్యత కఠినతరంగా మారిన నేపథ్యంలో సమీకరణ వ్యయాలు పెరిగాయని వివరించారు. 



You may be interested

వరుసగా మూడవదఫా రేటు కోత

Tuesday 16th April 2019

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిల్‌ లించ్‌ అంచనా... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిలించ్‌ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్‌) అంచనా వేసింది.

డివిడెండ్‌ కావాలా ..!

Tuesday 16th April 2019

రూ.2,000 కోట్ల మేర అన్‌క్లెయిమ్‌డ్‌ డివిడెండ్‌లు -ఐఈపీఎఫ్‌ఏ వద్ద పేరుకుపోతున్న డివిడెండ్‌లు  -షేర్‌ సర్టిఫికెట్‌ ఉన్న వాటాదారులకే సమస్య -షేర్ల బదిలీలో సమస్యలు  ఎవరూ క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌లు భారీగా ఐఈపీఎఫ్‌ఏ వద్ద పేరుకుపోతున్నాయి.  దాదాపు రూ.2,000 కోట్ల విలువైన క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌ చెల్లింపులు ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అధారిటీ(ఐఈపీఎఫ్‌ఏ) వద్ద ఉన్నాయి. అలాగే క్లెయిమ్‌ చేయని షేర్లు కూడా రూ.19,000 కోట్ల మేర ఈ సంస్థ వద్ద ఉన్నాయని అంచనా.

Most from this category