STOCKS

News


దేశీయ సహజవాయువు ధర 10 శాతం పెంపు

Saturday 29th September 2018
news_main1538201724.png-20702

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరను 10 శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌, ఎరువుల తయారీ వ్యయాలు పెరిగి అంతిమంగా ధరల పెరుగుదలకు దారితీయనుంది. మిలియన్‌ బ్రిటిష్‌ ధర్మల్‌ యూనిట్‌ గ్యాస్‌ ధరను అక్టోబర్‌ 1 నుంచి 3.36 డాలర్లకు పెంచింది. ఇది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇది 3.06 డాలర్లుగా ఉంది. అమెరికా, రష్యా, కెనడా దేశాల్లో సగటు ధరను ఆధారంగా చేసుకుని ప్రతీ ఆరు నెలలకు ప్రభుత్వం దేశీయంగా ధరలను నిర్ణయిస్తుంటుంది. మన దేశ గ్యాస్‌ అవసరాల్లో సగం మేర దిగుమతి చేసుకుంటున్నాం. దీని ధర దేశీయ గ్యాస్‌ ధర కంటే రెట్టింపు ఉంటోంది. ధరల పెంపుతో ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఆదాయాలు పెరగనున్నాయి. ‍క్లిష్టమైన ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌ ధరను సైతం మిలియన్‌ బ్రిటిష్‌ ధర్మల్‌ యూనిట్‌కు 6.78 డాలర్ల నుంచి 7.67 డాలర్లు చేసింది.



You may be interested

ఇన్ఫీబీమ్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ డ్యామేజ్‌ !

Saturday 29th September 2018

న్యూఢిల్లీ: ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌ షేర్‌ శుక్రవారం 70 శాతం.. అక్షరాలా 70 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో గురువారం రూ.196  వద్ద ముగిసిన ఈ షేర్‌ శుక్రవారం 70.24 శాతం(రూ.139) నష్టపోయి రూ.58.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 73 శాతం పతనంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.53.80ను తాకింది. బీఎస్‌ఈలో 1.9 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ముప్పావు

తగ్గిన భారత్‌ విదేశీ రుణ భారం

Saturday 29th September 2018

ముంబై: భారత్‌ విదేశీ రుణ భారం జూన్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో 2.8 శాతం తగ్గింది. అప్పటికి ఈ రుణ మొత్తం 514.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018 మార్చితో ముగిసిన త్రైమాసికంతో చూస్తే, ఇది 14.9 బిలియన్‌ డాలర్లు తక్కువ. వాణిజ్య రుణాలు (ఈసీబీ), స్వల్ప కాలిక డెట్‌, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు తగ్గడం దీనికి కారణం. ఇక ఇదే కాలంలో జీడీపీలో విదేశీ రుణ భారం నిష్పత్తి  20.5

Most from this category