News


వ్యాపార సులభతరంలో టాప్‌-50లోకి

Tuesday 20th November 2018
news_main1542685216.png-22208

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు ‘వ్యాపార నిర్వహణ సులభంగా ఉండే దేశాల సూచీ’లో అగ్ర స్థాయి 50 దేశాల్లోకి చేరడమే భారత్‌ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ ఆర్థిక రంగ పరిమాణాన్ని రెట్టింపు స్థాయి 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్లే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశీయ పారిశ్రామికవేత్తలతో వ్యాపార సులభతరంపై నిర్వహించిన సమావేశంలో భాగంగా మోదీ తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు. విధానాల పరంగా అచేతన స్థితి ముగిసిపోయిందన్నారు. తమ ప్రభుత్వం విధానాల ఆధారిత పాలన అందించడం వల్ల భారత్‌ ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర దేశాల సూచీలో 2014లో ఉన్న 142వ స్థానం నుంచి ఈ ఏడాది 77వ స్థానానికి మెరుగుపడినట్టు ప్రధాని చెప్పారు. ‘‘సంస్కరణలు కొనసాగుతాయి. దేశంలో వ్యాపారం మరింత సులభంగా నిర్వహించేందుకు వీలుగా ప్రక్రియలు కూడా సులభంగా మారతాయి’’అని ప్రధాని హామీ ఇచ్చారు. 



You may be interested

కేంద్రం, ఆర్‌బీఐ మధ్య సయోధ్య!

Tuesday 20th November 2018

ముంబై: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య దాదాపు కీలక అంశాలన్నిటి మధ్యా సయోధ్య కుదిరింది. సున్నితమైన పలు అంశాలకు సంబంధించి  ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో... సోమవారం ఆర్‌బీఐ బోర్డు సమావేశం తొమ్మిది గంటలకు పైగా వీటన్నింటిపై చర్చించింది. ‘‘సుహృద్భావ పూర్వక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. చాలా అంశాలు స్నేహపూర్వక రీతిలో పరిష్కారం అయ్యాయి’’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. తదుపరి ఆర్‌బీఐ బోర్డు సమావేశం డిసెంబర్‌

రెండున్నర నెలల గరిష్టానికి రూపాయి

Tuesday 20th November 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీ ధోరణి కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంకింగ్‌ ట్రేడింగ్‌లో సోమవారం వరుసగా ఐదవ రోజు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ రూపాయి బలపడింది. ఒకేరోజు 26 బలపడి 71.67కు చేరింది. ఇది పది వారాల గరిష్ట స్థాయి. విదేశీ నిధుల ప్రవాహం, గరిష్ట స్థాయిల నుంచి 20 డాలర్ల వరకూ క్రూడ్ ధరలు పతనం వంటి అంశాలు రూపాయి బలపడ్డానికి దారితీస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ప్రారంభంలో 9

Most from this category