STOCKS

News


ముంబై విమానాశ్రయం మరో నూతన రికార్డు

Monday 10th December 2018
news_main1544417102.png-22787

ముంబై: ముంబైలోని జీవీకే గ్రూపు నిర్వహణలో ఉన్న ఛత్రపతి శివాజి మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం మరో నూతన రికార్డును నమోదు చేసింది. శనివారం ఒక్క రోజే ఈ విమానాశ్రయం నుంచి 1,007 విమానాలు రాకపోకలు (వచ్చినవి, వెళ్లినవి) సాగించాయి. దీంతో 24 గంటల్లో 1,003 విమానాల రాకపోకలతో ఈ ఏడాది జూన్‌ 6న నమోదైన రికార్డును తానే తిరగరాసింది. ముకేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ ముందస్తు సంబరాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ రికార్డు సాధన సాధ్యమైంది. ఎంతో మంది కార్పొరేట్‌ ప్రముఖులు, బాలీవుడ్‌ నటీ నటులు ప్రైవేటు విమానాల్లో ముంబై నుంచి బయల్దేరి వెళ్లారు.  



You may be interested

చరణ్‌సింగ్‌ ఓకే అంటే ఆనాడే ఆదాయపన్ను శాఖ కంప్యూటరీకరణ

Monday 10th December 2018

న్యూఢిల్లీ: భారత్‌ ఓ బంగారం వంటి అవకాశాన్ని జారవిడుచుకుందని, 1970ల చివర్లో పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత పన్ను వ్యవస్థ రూపకల్పన ప్రతిపాదనను టీసీఎస్‌ తీసుకురాగా, నాటి ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్‌ తిరస్కరించినట్టు మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ శశాంక్‌ షా తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘ది టాటా గ్రూపు: ఫ్రమ్‌ టార్చ్‌ బేరర్స్‌ టు ట్రయల్‌బ్లేజర్స్‌’ పేరుతో షా రాసిన పుస్తకంలో ఈ వివరాలు పేర్కొన్నారు. ‘‘1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ అనంతరం

మాల్యా అప్పగింతపై నేడు బ్రిటన్ కోర్టు తీర్పు

Monday 10th December 2018

లండన్‌:  రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (నేడు) తీర్పునిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన అప్పగింతకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం భావించిన పక్షంలో తుదినిర్ణయం తీసుకునేందుకు ఈ కేసును బ్రిటన్ హోంశాఖకు పంపవచ్చని న్యాయనిపుణులు జైవాలా అండ్ కో మేనేజింగ్ పార్ట్‌నర్ పావని రెడ్డి తెలిపారు. ప్రతికూల ఉత్తర్వులు వచ్చిన పక్షంలో

Most from this category