ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ
By Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కునెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 1.6 శాతం పెరిగి రూ.1,099.80 ఆల్‌టైమ్ హై స్థాయికి చేరింది. దీంతో అంబానీ సంపద 44.3 బిలియన్ డాలర్లకు పెరిగి ఉంటుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. జాక్ మా సంపద విలువ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ముకేశ్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లమేర పెరిగితే, జాక్ మా సంపద 1.4 బిలియన్ డాలర్లమేర హరించుకుపోయింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 బిలయన్ డాలర్ల క్లబ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
You may be interested
మారుతీ కార్లలో లిథియమ్ బ్యాటరీలు!!
Friday 13th July 2018న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ కంపెనీ తన వాహనాల్లో లిథియమ్-అయాన్ బ్యాటరీలను అమర్చాలని భావిస్తోంది. మరీ ముఖ్యంగా తన భారత్ విభాగమైన మారుతీ సుజుకీ ఇండియా విక్రయించే ప్రీమియం కార్లలో వీటిని అమర్చాలని చూస్తోంది. హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్, దీని కన్నా ఖరీదైన మోడళ్లలో సాంప్రదాయిక లెడ్ బ్యాటరీల స్థానంలో దీర్ఘకాలం పనిచేసే లిథియమ్-అయాన్ బ్యాటరీలను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లిథియమ్-అయాన్ బ్యాటరీల వల్ల వ్యయం తగ్గుతుందని
జాన్సన్ అండ్ జాన్సన్‌కు 4.7 బిలియన్ డాలర్ల జరిమానా
Friday 13th July 2018సెయింట్ లూయీ (అమెరికా): బేబీ టాల్కం పౌడర్‌లో ఆస్బెస్టాస్ అవశేషాల వివాదంలో దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కి (జేఅండ్‌జే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడటం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడిన 22 మంది బాధిత మహిళలు, వారి కుటుంబాలకు 4.7 బిలియన్ డాలర్ల మేర పరిహారం చెల్లించాలంటూ సెయింట్ లూయీ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా జేఅండ్‌జే తయారు చేసే బేబీ పౌడర్, షవర్